SWP Calculator : కోట్లు సంపాదించే పథకం.. ఒకేసారి పెట్టుబడి పెట్టండి.. జీవితాంతం నెలకు రూ. 20వేలు సంపాదించవచ్చు..!

SWP Calculator : సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP)లో మీరు పెట్టుబడి పెట్టే మొత్తం ఆధారంగా జీవితాంతం ప్రతి నెలా క్రమం తప్పకుండా భారీగా ఆదాయాన్ని సంపాదించవచ్చు.

SWP Calculator : కోట్లు సంపాదించే పథకం.. ఒకేసారి పెట్టుబడి పెట్టండి.. జీవితాంతం నెలకు రూ. 20వేలు సంపాదించవచ్చు..!

SWP Calculator

Updated On : April 13, 2025 / 4:59 PM IST

SWP Calculator : ప్రస్తుత రోజుల్లో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. దీనికి తోడుగా అవసరాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. ఇలాంటి పరిస్థితిలో చాలామందికి నెలకు లక్ష జీతం వచ్చినా డబ్బు అసలు సరిపోదు. ఏదో ఒకదానిపై ఖర్చు అయిపోతూనే ఉంటుంది. ఫలితంగా మీరు అనుకున్నవన్నీ సాధించలేకపోవచ్చు.

కానీ, మీరు కోరుకుంటే, మీ ఆదాయాన్ని సరైన చోట పెట్టుబడి పెడితే.. భవిష్యత్‌లో ఆర్థిక లక్ష్యాలను వేగంగా సాధించవచ్చు. మీకోసం అద్భుతమైన ఒక పథకం అందుబాటులో ఉంది. ఈ స్కీమ్ సాయంతో మీరు కోట్ల రూపాయలు ఆదా చేయొచ్చు. మీరు నెలవారీ ఆదాయంగా డబ్బును కూడా విత్ డ్రా చేసుకోవచ్చు.

మ్యూచువల్ ఫండ్‌లో సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP) అనేది ఒక స్కీమ్. ఈ స్కీమ్ కింద మీరు ఒకేసారి ఒక మొత్తాన్ని డిపాజిట్ చేయొచ్చు. దాంతో మీరు జీవితాంతం ప్రతి నెలా క్రమంతప్పకుండా ఆదాయం పొందవచ్చు. ఇందులో మీరు ఎంత ఖర్చు చేసినా మీ డబ్బు తరగదు. మిగిలిన మొత్తంపై భారీగా రాబడి వస్తూనే ఉంటుంది. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP) SIP కన్నా అత్యంత పవర్‌ఫుల్ ప్లాన అని చెప్పవచ్చు.

SWP స్కీమ్ ఎలా పనిచేస్తుందంటే? :
మీ దగ్గర కేవలం రూ.50 లక్షల కార్పస్ ఉండి.. రాబోయే 25 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ.20వేలు విత్‌డ్రా చేసుకుంటే.. మీ దగ్గర ఇంకా రూ.3 కోట్ల భారీ కార్పస్ ఉంటుందని అనుకుందాం.. మీరు ఈ మొత్తాన్ని SIPలో చేయలేకపోవచ్చు. అందుకే SWPని SIP కన్నా పవర్‌పుల్ స్కీమ్ అని చెబుతారు.

రూ. 3 కోట్లు, నెలవారీ ఆదాయం ఎలా పొందాలి? :
వాస్తవానికి, ఈ సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP)లో మీరు ఎంత మొత్తాన్ని విత్‌డ్రా చేసినా మిగిలిన మొత్తంపై రాబడి అందుతూనే ఉంటుంది. సాధారణంగా, దీర్ఘకాలికంగా ఏదైనా మ్యూచువల్ ఫండ్లలో వార్షిక రాబడి 12శాతం నుంచి 15శాతం వరకు ఉంటాయి. కానీ, 10శాతం రేటుతో రాబడి లెక్కిస్తే.. మీరు SIP లేదా స్టాక్ మార్కెట్ ద్వారా పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 50 లక్షల కార్పస్‌ను పొందవచ్చు.

ఇప్పుడు అంతకన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టాలని భావిస్తే.. మీరు నెలవారీ పెట్టుబడి పెట్టవచ్చు. మీ డబ్బును ఎక్కువగా ఖర్చు చేయనక్కర్లేదు. ఇలాంటి పరిస్థితిలో SWP బెస్ట్ ప్లాన్ అని చెప్పవచ్చు. SWP కాలిక్యులేటర్ సాయంతో మీరు ఎంత పెట్టుబడి పెట్టాలి? మీకు ఎంత డబ్బు వస్తుందో తెలుసుకోవచ్చు.

మీ దగ్గర ఫండ్ రూ. 50 లక్షలు ఉండి.. రాబోయే 25 ఏళ్లకు ప్రతి నెలా రూ. 20వేలు విత్‌డ్రా చేసుకుంటే.. మీరు మొత్తం రూ. 60 లక్షలు విత్‌డ్రా చేసుకుంటారు. అయినప్పటికీ, మీ ఏకమొత్తం పెట్టుబడి మొత్తం రూ. 2,97,94,567 అంటే.. దాదాపు రూ. 3 కోట్లు ఉంటుంది.

ఎందుకంటే.. ప్రతి నెలా రూ. 20వేలు విత్‌డ్రా చేసినా కూడా మీ పోర్ట్‌ఫోలియోలో మిగిలి ఉన్న మొత్తానికి వడ్డీ పొందవచ్చు. దీని కారణంగానే మీ పోర్ట్‌ఫోలియో వాల్యూ రోజురోజుకూ పెరుగుతూ పోతుంది.

Note : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీరు SWPలో పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి. ఆ తర్వాతే పెట్టుబడిపై ఒక నిర్ణయం తీసుకోండి.