నిపుణలు ఊహించినదాని కంటే అమెరికా ఎకనామీ 2018 డిసెంబర్ లో ఎక్కువ ఉద్యోగాలను సృష్టించగల్గింది. ఓ వైపు ప్రపంచ అగ్రదేశాలతో ట్రేడ్ వార్ కొనసాగిస్తూనే తన దేశంలో ఉద్యోగాల కల్సనపై అమెరికా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. అమెరికాలో ఉద్యోగాల వద్ధి రేటు డిసెంబర్ లో భారీగా పెరగడంపై అమెరికన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 1లక్షా 77వేల ఉద్యోగాల కల్పించగలరని నిపుణలు అంచనా వేశారు. అయితే ఆ అంచనాలను తారుమారు చేస్తూ 3లక్షల 12వేల ఉద్యోగాలను కొత్తగా సృష్టించగల్గినట్లు అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ ప్రకటించింది.
గంటకు సగటు వేతన వార్షిక రేటు శాతం కూడా 3.2శాతం పెరిగింది. కొన్ని నెలలుగా స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నప్పటికీ అమెరికా ఎకనామీ చాలా ఆరోగ్యకరంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంప్లాయిమెంట్ రిపోర్ట్ ప్రకారం ఇంకా అమెరికా ఎకానమీ ముందుకు దూసుకెళ్తుందని విశ్లేషకుడు పౌల్ ఆష్వార్త్ తెలిపారు. 2017తో పోల్చుకుంటే పేరోల్స్ కూడా 2018లో 26 లక్షలు పెరిగింది. 2017లో ఈ సంఖ్య 22 లక్షలుగా ఉంది. 2018 చివరి మూడు నెలల్లో అయితే ప్రైవేటు ఉద్యోగుల సగటు గంట వేతనం కూడా 3.1శాతం కన్నా ఎక్కువగా పెరిగింది. అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనపై అధ్యక్షుడు ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. గ్రేట్ జాబ్స్ నెంబర్లను ప్రకటించామని ట్రంప్ తెలిపారు.