US millionaire woman eats cat food : ఆమె ఓ ప్రత్యేకమైన వ్యక్తి. కోట్ల రూపాయలు ఉన్నా పొదుపే తారక మంత్రంగా ఉపయోగిస్తోంది. కడుపునిండా తినదు, కంటినిండా నిద్రపోదు.. ఎప్పుడు పొదుపు పొదుపు అంటుంది. నీళ్లు కూడా చాలా లిమిట్ గా వాడుతుంది. మిలీనియర్ అయినా సరే నీకు ఇదే బుద్దే అంటే ఎవరెన్ని అనుకుంటే నాకెందుకు ‘ఖర్చు’చేయకుండా బతకాలి. ‘డబ్బులు’ కూడబెట్టాలి అంటుంది. పిల్లులు తినే ఆహారం తింటూ కోట్లు కూడబెడుతోంది. ఆఖరికి ఆమె ఇంటికి చాలా అరుదుగా వచ్చే గెస్ట్ లకు కూడా పిల్లులు తినే ఆహారాన్ని పెడుతుంది. దీంతో వాళ్లు నానా తిట్లు తిడుతున్నా..ఎవరుమనుకుంటే నాకెందుకు? అంటుంది..!!
ఆమె అమెరికాకు చెందిన మహిళా మిలీనియర్. 50 ఏళ్లు. పేద్ద ఇంట్లో ఉంటుంది. ఆమె సరాసరి ఆదాయం 5.3 మిలియన్లు (రూ.38.71 కోట్లు). కానీ మహా మహా పిసినారి. ఆమె గురించి తెలిస్తే పిసినారి సంఘానికి అధ్యక్షురాలేమో అనిపిస్తుంది. పేరు ఐమీ ఎలిజబెత్.డబ్బులు ఆదా చేయడానికి ప్రతీ రోజూ పిల్లులు తినే ఆహారాన్నే తింటుంది. అంతేకాదు ఈమె గురించి తెలిస్తే ఏంటిరా బాబూ ఇది పొదుపు కాదు కక్కుర్తి అంటాం. ఆమె నివసించే ఇంటికి తన ఖర్చుతో కాకుండా తన మాజీ భర్తతో పెట్టే ఖర్చుతో శుభ్రం చేయించుకుంటోంది. ఇక ఆమె పిసినారి పనులు గురించి తెలుసుకుంటే నీ కక్కుర్తిలో నా కమండలం అని అనకమానరు..
అమెరికాలోని లాస్ వెగాస్‌లో నివసిస్తున్న ఐమీ ఎలిజబెత్ సరాసరి ఆదాయం 5.3 మిలియన్లు ఇండియా కరెన్సీలో రూ.38.71 కోట్లు. ఇంత డబ్బున్నా..డబ్బు ఖర్చు పెట్టేవిషయంలో పిసినారికి అమ్మ మొగుడులా ఉంటుంది. అంత డబ్బున్నా వంటమనిషినిగానీ, పనివాళ్లను కూడా పెట్టుకోదు. ఖర్చు అయిపోతుందని. పిల్లులు తినే ఆహారాన్ని తింటుంది ప్రతీరోజు.
ఐమీ తన ఖర్చుల కోసం కేవలం వెయ్యి డాలర్లు (రూ.73 వేలు) మాత్రమే పక్కన పెట్టుకుంటుంది. అంతకంటే ఎక్కువగా ఒక్క డాలర్ కూడా ఖర్చు పెట్టదు. అమెరికాలో ఒక మిలీనియర్ అంత తక్కువ ఖర్చుతో బతకటం చాలా కష్టం. అది కేవలం ఐమీ ఎలిజిబెత్ కు మాత్రమే సాధ్యం..మనంకక్కుర్తి అనుకునే ఆమె పొదుపు గురించి ఓ ఇంటర్వ్యూలో ఎలిజిబెత్ ఏమంటుందంటే..‘‘ఉదయం నిద్రలేవగానే వాటర్ హీటర్‌ను కేవలం 22 నిమిషాలు మాత్రమే ఆన్‌లో ఉంచుతా. నాకు సరిపడా వేడి అయ్యేంత వరకూ మాత్రమే..అంతకంటే ఎక్కువగా కరెంట్ ఖర్చు చేయటం ఇష్టం ఉండదు. అలాగే వాటర్ ను టైమ్ ను కూడా వేస్ట్ చేయటం నాకిష్టం ఉండదు. దీని వల్ల నేను నెలకు 80 డాలర్లు (రూ.5840) పొదుపు చేస్తున్నానని తెలిపింది.
మరి ఆమె ఉండే పెద్ద ఇల్లు తన మాజీ భర్త మైఖెల్‌తో విడాకులు తీసుకున్న తర్వాత ఇచ్చిన ఇల్లు. అదికూడా ఫ్రీగానే. అంతేకాదు ఆమె పొదుపు గురించి తెలిసిన మైఖేల్ ఎలిజిబెత్ కు మరో ఆఫర్ కూడా ఇచ్చాడు. తను ఇచ్చిన ఇంటిని శుభ్రం చేసే బాధ్యత అతనే తీసుకున్నాడు. ఆ ఇంటిని,ఇంటి పరిసరాలను శుభ్రం చేసే బాధ్యత అతనిదే.దీంతో అంత ఇంట్లో ఉంటున్నా..ఆమెకు ప్రతి నెల ఎంతో డబ్బు పొదుపు చేస్తోంది. మాజీ భర్తకు క్లీనింగ్ పనులు అప్పగించడం తప్పేంటి అంటుంది ఎలిజిబెత్. ఎందుకంటే మైఖేల్ చాలా బొద్దుగా ఉంటాడు. ఇల్లు శుభ్రం చేస్తే అతనికి మంచి ఎక్సైర్ సైజు. జిమ్ ఖర్చు ఉండదుగా అంటుంది.
ఎలిజిబెత్ తిండి కోసం పెద్దగా ఖర్చు పెట్టదు. పిల్లులకు పెట్టే టునా టిన్స్ (క్యాట్ ఫుడ్) తింటానని చెబుతోంది. అంతేకాదు.. మా ఇంటికి వచ్చే గెస్ట్ లకు కూడా క్యాట్ ఫుడ్డే పెడతానని చెబుతోంది. కానీ అది చూసి వాళ్లు ఇదేం ఫుడ్ అని తిడుతుంటారని కానీ నేను అవేమీ పట్టించుకోను..వాళ్లు ఇష్టముంటే తింటారు లేదంటే మానేస్తారు. అని చాలా ఈజీగా చెప్పేస్తోంది.
పిల్లుల ఫుడ్ పెడితే వాళ్లు నన్ను హేళన చేస్తారు. ఇంత ఆస్తి ఉన్నా ఇదేంటీ అంటారు. కానీ నేను అవేవీ పట్టించుకోను..ఎందుకంటే.. నాకు డబ్బులు సేవ్ కావటం మాత్రమే ముఖ్యం అంటోందీ పిసినారి మిలియనీయర్..ఇంత పిసినారిగా ఉండి ఎలిజిబెత్ గురించి ఓ విషయం తెలుసుకోవాలి..ఆమె అత్యంత పేదరికాన్ని అనుభవించి పైకొచ్చిన మహిళ. ఒకప్పుడు తలదాచుకోడానికి ఇల్లు కూడా ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల నుంచి ఆమె రచయిత్రిగా మారి.. మిలీనియర్‌గా ఎదిగింది. దీంతో పొదుపే తారక మంత్రం అంటోందీ మిలీనియర్..