Donald Trump : దెబ్బకు దిగొచ్చిన ట్రంప్..! మోదీతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానంటూ పోస్ట్.. స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చిన ప్రధాని మోదీ.. కానీ..

Donald Trump : భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.

Donald Trump

Donald Trump : రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత దేశం దిగుమతులపై అమెరికా అదనపు సుంకాలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు ఉత్పత్తులపై 50శాతం సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించారు. మరికొద్ది రోజుల్లో సుంకాల భారాన్ని పెంచుతామంటూ హెచ్చరికలు చేశారు. అయితే, ట్రంప్‌లో ఉన్నట్లుండి ఒక్కసారిగా మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ట్రంప్ ఎంత దూకుడుగా వ్యవహరించినా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆచితూచి ముందుకు అడుగు వేస్తున్నారు. వ్యూహాత్మకంగా అమెరికాను ఇరుకునపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ట్రంప్ భారత్‌పై తన వైఖరిని మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. తాజాగా.. నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో కీలక కామెంట్స్ చేశారు.

Also Read: Nepal Protests: నేపాల్‌లో హింస.. మాజీ ప్రధాని భార్య సజీవదహనం.. షాకింగ్ వీడియో..

డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ఒక పోస్టులో భారత ప్రధాని మోదీ గురించి ప్రస్తావించారు. ‘భారత్ – యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలు వాణిజ్య అడ్డంకులను తొలగించుకునేందుకు చర్చలు కొనసాగిస్తున్నాయని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. రాబోయే రోజుల్లో నా స్నేహితుడు, ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు నేను ఎదురు చూస్తున్నాను. ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్య చర్చలకు విజయవంతమైన ముగింపు వచ్చేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఖచ్చితంగా అనుకుంటున్నాను’ అంటూ ట్రంప్ పేర్కొన్నారు.

దీనికి ముందు ట్రంప్ వైట్ హౌస్ లో ఒక ప్రకటన చేస్తూ.. భారత్ – అమెరికా దేశాల మధ్య సంబంధాలు చాలా ప్రత్యేకమైనవిగా చెప్పుకొచ్చారు. ఇండియాతో సంబంధాలను పునరుద్ధరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ మీడియా ప్రశ్నించగా.. నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. భారత ప్రధాని నరేంద్ర మోదీకి నేను ఎప్పటికీ స్నేహితుడినే. ఆయన గొప్ప ప్రధాని. అయితే, ఈ నిర్ధిష్ట సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు. కానీ, భారత్ – అమెరికా దేశాల మధ్య చాలా ప్రత్యేకమైన సంబంధం ఉంది అంటూ ట్రంప్ చెప్పారు.

ట్రంప్ వ్యాఖ్యలకు మోదీ స్పందన ఇదే.

ఇరు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు నేను ఎదురు చూస్తున్నానంటూ ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్ లో చేసిన పోస్టుకు ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ట్రంప్ పోస్టును ట్యాగ్ చేస్తూ ట్విటర్ వేదికగా మోదీ రిప్లయ్ ఇచ్చారు.
‘భారత్ , అమెరికా క్లోజ్ ఫ్రెండ్స్. మన మధ్య వాణిజ్య అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని భావిస్తున్నా. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నా. సమస్యను త్వరగా పరిష్కరించేందుకు అమెరికా, భారత్ లోని బృందాలు కృషి చేస్తున్నాయి. నేను కూడా ట్రంప్ తో మాట్లాడటానికి ఎదురుచూస్తున్నా. రెండు దేశాల భవిష్యత్తు కోసం మేము కలిసి పనిచేస్తాం అంటూ మోదీ పేర్కొన్నారు.