US Election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ.. ట్రంప్, జో బైడెన్ ఆసక్తికర పోస్టులు

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కు సమయం ఆసన్నమైంది. భారత కాలమానం ప్రకారం.. ఇవాళ సాయంత్రం 4గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది.

Trump and Joe Biden

Donald Trump – Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కు సమయం ఆసన్నమైంది. భారత కాలమానం ప్రకారం.. ఇవాళ సాయంత్రం 4గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది. అయితే, ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఎన్నికలు ఇవాళ జరగనుండగా.. పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే వరకు రెండ్రోజులు పట్టే అవకాశం ఉంది. ఇదిలాఉంటే పోలింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుండగా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ అభ్యర్ధి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు చేశారు.

Also Read : US Election 2024: అమెరికా అధ్యక్షుడికి జీతమెంత వస్తుందో తెలుసా..? ఎలాంటి సౌకర్యాలు అందుతాయంటే..

డొనాల్డ్ ట్రంప్ ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. మన దేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రాజకీయ ఘట్టానికి చేరువలో ఉన్నాం. అందరూ వచ్చి ఓటుహక్కు వినియోగించుకోవాలి.. అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దుకుందామని ఓటర్లకు ట్రంప్ పిలుపునిచ్చాడు. కమలా హారిస్, ఆమె కేబినెట్ అధికారంలోకి వస్తే పశ్చిమాసియా ఆక్రమణకు గురవుతుందని.. ఆమె మూడో ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభిస్తారని మీకు (ఓటర్లకు) తెలుసు. అందుకే ట్రంప్ నకు ఓటేయండి.. శాంతిని పునరుద్దరించండి.. అంటూ ట్రంప్ తన ఎక్స్ ఖాతాలో ఓటర్లకు పిలుపునిచ్చారు.


మరికొన్ని గంటల్లో జరగబోయే ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ను కమలా హారిస్ ఓడిస్తుందని నాకు తెలుసు.. అందుకు మీరంతా ఓటింగ్ లో పాల్గొనాలని ఓటర్లను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోరారు. ముందస్తు ఓటింగ్ ను వినియోగించుకోని వారంతా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయండని బైడెన్ అన్నారు.