US Children : 5ఏళ్ల లోపు పిల్లల్లో భారీగా హాస్పిటల్ చేరికలు

అమెరికాలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" తాజా విజృంభణకు కారణమని తెలుస్తోంది. అయితే వైరస్ వ్యాప్తి నుంచి ప్రారంభమైనప్పటి నుంచి లేని విధంగా

US Children :  అమెరికాలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్త వేరియంట్ “ఒమిక్రాన్” తాజా విజృంభణకు కారణమని తెలుస్తోంది. అయితే వైరస్ వ్యాప్తి నుంచి ప్రారంభమైనప్పటి నుంచి లేని విధంగా భారీగా కొత్త కేసులు నమోదవుతుండటంతో పాటుగా, హాస్పిటల్స్ లో చేరుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతుండటం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఐదేళ్ల లోపు పిల్లలు హాస్పిటల్స్ లో చేరుతున్న సంఖ్య ఇటీవల వారాల్లో భారీగా పెరిగిందని తాజా అమెరికా అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

అమెరికాలో..ఐదేళ్లలోపు చిన్నారుల్లో ప్రతి లక్ష మందిలో నలుగురు కంటే ఎక్కువ మంది చిన్నారులు హాస్పిటల్స్ లో చేరాల్సిన పరిస్థితి వస్తోందని అక్కడి అధికారులు తెలిపారు. అయితే 5-17ఏళ్ల చిన్నారుల విషయంలో ఆ సంఖ్య ఒకటిగానే ఉంది. మిగిలిన వయస్సువారితో పోల్చుకుంటే చిన్నారుల్లో హాస్పిటల్ప్ చేరిక తక్కువగానే, అయితే వైరస్ వ్యాప్తి ప్రారంభమైన దగ్గరి నుంచి పిల్లలు హాస్పిటల్స్ లో చేరుతున్న రేటు మాత్రం ఇప్పుడే అత్యధికమని సీడీసీ డైరెక్టర్ డాక్టర్ రాచెల్లె వాలెన్స్కీ తెలిపారు.

ఊబకాయం, మధుమేహం, ఊపిరితిత్తుల సమస్యలున్న పిల్లల్లో ఈ  వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటోందని ప్రముఖ వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అన్నారు. చిన్నారుల్ని రక్షించుకునేందుకు అంతా టీకా తీసుకోవడమే ఉత్తమమైన మార్గమని తెలిపారు. ఇక, 5 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి వస్తుందని అక్కడి తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఫైజర్ టీకా అందుబాటులోకి వస్తుందని భావించినప్పటికీ రెండు డోసుల వ్యాక్సిన్ ఆశించినంత రక్షణ ఇవ్వడం లేదని ఆ సంస్థ గత నెలలో ప్రకటించి వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే.

ALSO READ CM KCR : చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో సీఎం కేసీఆర్, సమతామూర్తి విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై చర్చ

ట్రెండింగ్ వార్తలు