US Special Bill: పాకిస్తాన్‌కి కోపం తెప్పించేలా అమెరికా బిల్లు.. తాలిబాన్‌లకు చెక్ పెట్టేందుకేనా?

అఫ్ఘానిస్తాన్‌ను గుప్పిట్లో పెట్టుకుని తీవ్రవాద సంస్థలకు అండగా నిలుస్తోన్న తాలిబాన్లను అణిచివేసేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది.

Biden

US Special Bill: ఇటీవల, అమెరికా ఓ బిల్లు ప్రవేశపెట్టబడింది. ఈ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం కోపంగా ఉంది. అఫ్ఘానిస్తాన్‌ను గుప్పిట్లో పెట్టుకుని తీవ్రవాద సంస్థలకు అండగా నిలుస్తోన్న తాలిబాన్లను అణిచివేసేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అమెరికన్‌ సెనేట్‌లోని 22 మంది రిపబ్లికన్‌ సభ్యులు ఒక బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే అఫ్ఘానిస్తాన్ కంటే, పాకిస్తాన్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తొంది.

బైడెన్ ప్రభుత్వం ఈ బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లయితే పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ నాశనం అవడం ఖాయమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లు అంశం ప్రస్తావనే అవమానంగా భావిస్తోంది పాకిస్తాన్. అక్కడి సైన్యం, ఐఎస్ఐతో సహా అన్నీ సంస్థలు భయందోళనలో ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. బిల్లు ఆమోదం పొందడం కూడా కష్టమేం కాదని అంటున్నారు నిపుణులు.

వాస్తవానికి, ఈ తాలిబాన్ వ్యతిరేక బిల్లులో తాలిబాన్లు మరియు వారి మిత్రదేశాలపై ఆర్థిక ఆంక్షలను విధించే అవకాశం కనిపిస్తుంది. ఈ బిల్లు ప్రవేశపెట్టిన తరువాత, పాకిస్తాన్ రాజకీయ నాయకులు చాలా మంది ప్రకటనలు ఇచ్చారు. అమెరికాకు మద్దతు ఇచ్చినందుకు పాకిస్తాన్ మూల్యం చెల్లిస్తోందని కూడా చెప్పారు. అయితే, ఈ విషయంలో అమెరికా వైఖరి కూడా స్పష్టంగా ఉన్నట్లుగా అర్థం అవుతోంది.

ఈ తాలిబాన్ వ్యతిరేక బిల్లు తాలిబాన్లు మరియు వారి మిత్రదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించడం గురించి మాట్లాడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలకు సమీపంలో ఉన్న పాకిస్తాన్ ప్రాంతం ఉగ్రవాదులకు ఆశ్రయంగా ఉపయోగించబడుతుందనే విషయంపై తాము చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నామని అమెరికా చెబుతోంది. తాలిబాన్ పోరాటయోధులకు పాకిస్తాన్‌లో ఎందుకు స్థానం లభిస్తుంది? వారి వైద్యచికిత్సకు సహకరించిన విషయంలో అమెరికా పాకిస్తాన్‌ను విమర్శించాయి.

ఈ క్రమంలోనే పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ మాట్లాడుతూ.. చాలా కాలంగా మా ఆందోళనల గురించి పాకిస్తాన్‌తో నిజాయితీగా మాట్లాడామని, ఈ ఆందోళనలు పాకిస్తాన్ సరిహద్దులోని సురక్షిత స్వర్గాల గురించేనని. ఈ ఆందోళనలు నేటికీ కొనసాగుతున్నట్లుగా చెప్పారు. అఫ్ఘానిస్తాన్‌ నుంచి ఉన్న పలంగా సైన్యాన్ని వెనక్కి రప్పించిన బైడెన్‌ ప్రభుత్వంపై అటు ప్రజల్లో, ఇటు మీడియాలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. దీని నుంచి బయటపడేందుకు ఈ బిల్లును తీసుకొచ్చి తాలిబాన్‌ను అణిచివేయాలని బైడెన్‌ ప్రభుత్వం ప్లాన్‌ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. తాలిబాన్‌తోపాటు పాకిస్తాన్‌కూ గుణపాఠం చెప్పేందుకే ఈ బిల్లును అమెరికా తెస్తున్నట్లుగా కామెంట్‌ చేస్తున్నారు.