‘సౌతాఫ్రికా కరోనా స్ట్రెయిన్‌పై ఏ వ్యాక్సిన్ పనిచేయదు’

Corona Strain: విశ్వ వ్యాప్తంగా కరోనా టీకా వచ్చేసిందన్న సంతోషంలో ఉంది. అదే సమయంలో మరో పీడకల వెంటాడుతూనే ఉంది. దాదాపు సంవత్సరానికి పైగా ప్రజలను అతలాకుతలం చేసిన కరోనా చాలదన్నట్లు ఇప్పుడు స్ట్రెయిన్ ఒకటి పట్టిపీడిస్తుంది. మరి ఈ కరోనా వ్యాక్సిన్ కొత్త స్ట్రెయిన్ పై పనిచేస్తుందా అంటే బ్రిటన్‌ హెల్త్ సెక్రటరీ మాట్ హాన్కాక్ నో చెప్పేశారు.

దక్షిణ ఆఫ్రికాలో బయటపడిన కరోనా స్ట్రెయిన్‌పై వ్యాక్సిన్లు పనిచేయవని ఓ శాస్త్రవేత్త చెబుతున్నట్లు ఆయన అన్నారు. ఆఫ్రికా రకం కరోనా వైరస్‌ గురించి చాలా ఆందోళనగా ఉందని సోమవారం స్పష్టం చేశారు. బ్రిటన్‌ కరోనా స్ట్రైయిన్‌ను దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన కరోనా వ్యాక్సన్లు ఆఫ్రికా స్టైయిన్‌పై పని చేస్తాయా అనే సందేహాన్నిగవర్నమెంట్ సైంటిఫికల్ అడ్వైజర్స్‌లో ఒకరు చెప్పడమే ఆందోళనకు కారణంగా మారిందన్నారు.

బ్రిటన్‌ స్ట్రైయిన్ కంటే సౌతాఫ్రికాలోని కొత్త వేరియంట్ చాలా డిఫరెంట్‌గా ఉందని సైంటిస్టులు తెలిపారు. మానవ కణాలకు సోకడానికి వైరస్ ఉపయోగించే ముఖ్యమైన స్పైక్ ప్రొటీన్‌లో మల్టీ మూటేషన్స్ ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం బ్రిటన్‌ ప్రజలకు ఇస్తున్న కరోనా వ్యాక్సిన్ సౌతాఫ్రికా వేరియంట్‌పై పని చేస్తుందా అనే దానిపై గవర్నమెంట్ వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ రెజియస్ మెడిసిన్ ప్రొఫెసర్ జాన్ బెల్ బిగ్ డౌట్‌తో ముందుకొచ్చారు.

ఒకవేళ ఆఫ్రికా స్ట్రైయిన్‌పై ఈ వ్యాక్సిన్‌ పని చేయకపోతే మరో వ్యాక్సిన్‌ తయారికి కొంత సమయం పట్టవచ్చని అభిప్రాయపడ్డారు. అలా అయితే వ్యాక్సిన్ రెడీ అయినా ధైర్యంగా ఉండటానికి వీల్లేదా అనే భయపడటం ప్రజల వంతుగా మారింది.