Terrifying Video: తీర్పు చదువుతోన్న మహిళా జడ్జిపైకి ఎగిరి.. దాడి చేసిన నిందితుడు

అయినప్పటికీ జడ్జిని నిందితుడు గట్టిగా పట్టుకుని వదలకపోవడంతో అందరూ ఆందోళన చెందారు. జడ్జి తలకి..

Las Vegas judge attacked in court

అమెరికాలోని లాస్ వేగాస్‌లో ఓ న్యాయస్థానంలో మహిళా జడ్జి తీర్పు చదువుతుండగా ఆమెపై దాడికి పాల్పడ్డాడు ఓ నిందితుడు. జడ్జి ముందు ఉన్న బెంచ్‌పైకి ఎగిరి మరీ దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు చిక్కింది.

క్లార్క్ కౌంటీ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో మహిళా జడ్డి మేరీ కే హోల్థస్ బుధవారం డియోబ్రా రెడ్డెన్ (30) అనే నిందితుడికి ఓ కేసులో శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వసాగారు. తన న్యాయవాది వాదనలను, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోకుండా తనకు శిక్ష విధించినందుకు డియోబ్రా రెడ్డెన్ కోర్టులోనే ఆగ్రహంతో ఊగిపోయాడు.

ఒక్కసారిగా జడ్జి ముందున్న బెంచి పై నుంచి దూకి ఆమె మెడను గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో కోర్టులోని ఇతర ఉద్యోగులు ఆ నిందితుడిని పక్కకు లాగడానికి ప్రయత్నించారు.

అయినప్పటికీ జడ్జిని నిందితుడు గట్టిగా పట్టుకుని వదలకపోవడంతో అందరూ ఆందోళన చెందారు. జడ్జి తలకి స్పల్పంగా గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. మార్షల్ సిబ్బందికి కూడా గాయాలయినట్లు వివరించారు. నిందితుడిని అరెస్టు చేసి జైలుకి తరలించామని అన్నారు.

Urfi Javed : ఆక్సిజన్ మాస్క్‌తో ఆసుపత్రి బెడ్‌పై ఉర్పీ జావేద్..అసలేమైంది?