Viral Video: రోటీలు స్మూత్‌గా రావాలా? ఓ మహిళ చెబుతున్న సీక్రెట్ ఫాలో అవ్వండి

రోటీలు స్మూత్ గా వస్తే తినడానికి అందరూ ఇష్టపడతారు. అలా రావడానికి కొన్ని రకాల టిప్స్ ఫాలో అవుతుంటారు. ఓ జర్మన్ లేడీ చెబుతున్న టిప్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అదేంటో చదవండి.

Viral Video

Viral Video : రోటీలు స్మూత్‌గా చేయడానికి రకరకాల టిప్స్ ఫాలో అవుతుంటారు. ఓ జర్మన్ లేడీ తన వీడియోలో రోటీలు స్మూత్‌గా రావడానికి ఏమి యాడ్ చేయాలో చేసి చూపించింది. ఆ వీడియో వైరల్ అవుతోంది.

Rajasthan : మహిళను 500 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. రక్షించడానికి పరుగులు తీసిన జనం.. వైరల్ వీడియో

భారతీయ వంటల అద్భుతాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీలకు విస్తరిస్తున్నాయి. మన వంటలను విదేశీయులు కూడా గుర్తిస్తున్నారు. ఇండియన్‌ను పెళ్లాడిన ఆండ్రియా అనే మహిళ రోటీ పిండికి ఓ పదార్ధాన్ని జోడించి సూపర్ సాఫ్ట్‌గా చేయవచ్చని వీడియోలో చూపించింది. ఈ క్లిప్ వైరల్ అవ్వడమే కాదు ఇంటర్నెట్ చెఫ్‌లు, ఇండియన్ కుక్‌లను కూడా ఆకర్షించింది.

MS Dhoni : మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్న మహేంద్ర సింగ్ ధోని.. వీడియో వైరల్

@we_coffeemilkfamily అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ అయిన వీడియోలో రోటీని మెత్తగా చేయడానికి ఆండ్రియా జోడించిన పదార్ధం అవకాడో తప్ప వేరేది కాదు. పిండిని నీటిలో కలిపినపుడు అవకాడోని మెత్తగా చేసి ఆ పిండిలో మిక్స్ చేసింది. ఇలా చేయడం వల్ల రోటీలు మృదువుగా వస్తాయట. ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం రోటీలు స్మూత్‌గా రావడానికి తమకు తెలిసిన టిప్స్ చెప్పారు. రోటీ పిండిలో బచ్చలికూర యాడ్ చేస్తే మెత్తగా వస్తాయని.. రోటీ పిండిలో బీట్‌రూట్ యాడ్ చేస్తే ఆ రంగు పిల్లలకు ఆసక్తికరంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆండ్రియా వీడియో వైరల్ అవుతోంది.