Canada
Canada : ప్రేమికుల మధ్య దూరం మరింత దూరానికి దారి తీస్తుంది అని అంటారు. కానీ కొందరి విషయంలో అది నిజం కాదనిపిస్తుంది. 5 సంవత్సరాలు దూరంగా ఉన్న ఓ జంట తిరిగి ఒక్కటైన సందర్భానికి ఎయిర్ పోర్టు వేదిక అయ్యింది. తన బాయ్ ఫ్రెండ్‌ను కలుస్తున్న సంబరంలో ప్రియురాలు అతనికి ఎలా వెల్కం చెప్పిందో చదవండి.
Pushpa 2 : పుష్ప సాంగ్ పై అమితాబ్ వైరల్ కామెంట్స్.. చెప్పు వదిలేసినా వైరల్ అవుతుందా..?
నిత్యం ఒకరిని ఒకరు చూసుకుంటూ ..కలుసుకుంటున్న ప్రేమలే అట్టే కాలం నిలబడట్లేదు.. 5 ఏళ్లు ప్రేమికులు దూరంగా ఉండటం అంటే.. అయినా వారి మధ్య ఎంతో ప్రేమ ఉందంటే అది నిజమైన ప్రేమగా చెప్పాలి. ఐదేళ్ల తర్వాత ఓ ప్రేమ జంట ఒకరినొకరు చూసుకున్నారు. ఆ సందర్భంలో ప్రియుడికి అతని ప్రియురాలు డిఫరెంట్‌గా వెల్కం చెప్పాలని అనుకుంది. అందుకోసం బాలీవుడ్ సాంగ్‌కి స్టెప్పులు వేసింది. పాట పూర్తవ్వగానే అతను ఆగలేకపోయాడు.. ఆత్మీయంగా ఆమెను హగ్ చేసుకున్నాడు. కెనడాలోని ఎయిర్ పోర్టు ఈ అందమైన కలయికకు వేదిక అయ్యింది. _nikishah అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
Viral Video : వాయమ్మో..! ఇవేం పకోడీలమ్మా తల్లీ..! చూస్తే షాక్ .. తింటే షేక్ అవ్వాల్సిందే..
ఎయిర్‌పోర్టులో ఆ యువతి బాయ్ ఫ్రెండ్‌కి వెల్కం చెప్పిన విధానం చూస్తూ చాలామంది ఆగిపోయారు. ఆఖరున క్లాప్స్ కొట్టకుండా ఉండలేకపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్టులో ‘ దూరంగా ఉండగలిగే పరీక్షను తట్టుకోగలిగితే మీరు స్థిరమైన అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు’ అనే శీర్షికను కూడా యాడ్ చేశారు. ప్రేమను గెలిపించుకోవాలంటే కొన్ని సవాళ్లుంటాయి.. వాటిలో ఒకటి ఎదురుచూడటం. 5 సంవత్సరాల ఎదురుచూపులో ఎంతో ఎడబాటుని చూసిన ఆ జంట చివరికి తమ ప్రేమలో విజయం సాధించారు. తమ బంధాన్ని పదిలం చేసుకున్నారు.