Zimbabwe : దొంగ పాము.. కరెన్సీ నోట్లను ఎత్తుకెళ్తున్న పాము వీడియో వైరల్

ఇంటర్నెట్‌లో చిత్ర విచిత్రమైన వీడియో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ పాము డబ్బు కట్టలు దొంగతనం చేసి తీసుకెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు.

Zimbabwe

Zimbabwe : జింబాబ్వేలోని ఓ ఇంట్లో పాము కరెన్సీ నోట్లను దొంగిలించి  తన వెంట తీసుకెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది. విచిత్రమైన ఈ సంఘటన చూసి జనం నోరెళ్లబెట్టారు.

Woman : ఇంటి సీలింగ్ నుండి రెండు పెద్ద పాములను చేతులతో బయటకు తీసిన మహిళ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఒక్కోసారి కొన్ని విచిత్రమైన సంఘటనలు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇప్పుడు చెప్పబోయే సంఘటన జింబాబ్వేలో జరిగింది. lindaikejiblogofficial అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేరైన ఓ వీడియోలో కొండచిలువ నోటితో నోట్ల కట్టలు కరుచుకుని తీసుకెళ్తున్నట్లు కనిపించింది. అరుగు మీద నుంచి ఓ ఇంట్లోకి వెళ్తుండగా వీడియో ఎండ్ అయ్యింది.

Snake Bite : పాము కాటు వేసినా చనిపోని జంతువులు ఏవో తెలుసా..?

పాము డబ్బు దొంగిలించి తీసుకెళ్తున్న వీడియో చూసి నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసారు. కొందరు కామెడీగా కామెంట్లు పెడితే కొందరు ఈ వీడియో నకిలీ వీడియో అని.. నోట్ల కట్టలను పాముకి అతికించారని కామెంట్లు పెట్టారు. మొత్తానికి ఈ పాము వీడియో మాత్రం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు