King Cobra
King Cobra : ఎండాకాలం పూర్తైనా ఏ మాత్రం వేడి తగ్గలేదు. మనుష్యులు వేడిని తట్టుకోలేకపోతుంటే జంతువుల పరిస్థితి మరీ ఘోరం. వీటికి సరైన ఆహారం, నీరు దొరకక చనిపోతుంటాయి. అయితే ప్రమాదకరమైన సరీసృపాలకు నీరు అందించడమంటే మనం ఆమడ దూరం పరుగులు పెడతాం. కానీ ఓ వ్యక్తి భారీ కింగ్ కోబ్రాకి ఎంతో ధైర్యంగా.. దయతో నీళ్లు పట్టిస్తున్న వీడియో నెటిజన్లను షాక్‌కి గురి చేసింది.
world_of_snakes_ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోలో భారీ పాముకి ఓ వ్యక్తి నిర్భయంగా నీళ్లు అందిస్తున్నాడు. ఎటువంటి భయం కానీ, సంకోచం కానీ లేకుండా అతను చేసిన పని చాలామంది నెటిజన్ల మనసుని కదిలించింది. సోషల్ మీడియాలో షేరైన ఈ వీడియో వైరల్ అవుతోంది. ప్రతి వ్యక్తిలో జంతువుల పట్ల దయ, కరుణ ఉన్నా.. వాటికి సాయం చేయడానికి ధైర్యం కావాలి.. ఏ మాత్రం ఏమరుపాటుతనంతో వ్యవహరించినా ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే. అలాంటి ప్రమాదకర జంతువులకి సైతం మానవత్వాన్ని చూపించిన వ్యక్తిని నెటిజన్లు అభినందిస్తున్నారు.
‘కొంతమంది మనిషి యొక్క దయగల చర్య’ అంటూ ప్రశంసించారు. అతని ధైర్యాన్ని, నిస్వార్థతను చాలామంది మెచ్చుకున్నారు.