Anand Mahindra : కార్లతో తమపై నీళ్లు చల్లమంటూ రోడ్లపై నిలుచున్న వ్యక్తులు.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో వైరల్
బాగా వర్షంలో రోడ్డు మీద నీరు చిమ్ముతు కారు మన పక్కనుంచి వెళ్తే మనం గయ్ అని అరుస్తాం. కానీ కొందరు రోడ్డుపై నిలబడి వచ్చే పోయే కార్లను తమపై నీరు చల్లమంటూ అడుగుతున్నారు. ఈ వీడియో ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఏదైనా పాజిటివ్ గా తీసుకోవడం.. నెగెటివ్ గా తీసుకోవడం అనేది మన మైండ్.. లేదా యాటిట్యూట్‌ని బట్టి ఉంటుందంటూ ఆయన షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
- Lakshmi 10tv
- Published On : May 25, 2023 / 03:41 PM IST
Anand Mahindra
Anand Mahindra video viral : సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోల్లోని అంశాలు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. కొన్ని విచిత్రంగానూ అనిపిస్తాయి. రీసెంట్‌గా టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
Anand Mahindra : మహీంద్రా కార్లకు నో చెప్పండి .. ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కి నెటిజన్ల ఘాటు రిప్లై..
ఇంటర్నెట్‌లో కొన్ని అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. కొన్ని ప్రాంక్‌లు సరదా పుట్టిస్తే.. కొన్ని కోపంతో రగిలిపోయే వీడియోలు చూస్తుంటాం. ఆనంద్ మహీంద్రా తాజాగా షేర్ చేసిన వీడియో అందర్నీ ఆలోచింపచేస్తోంది. ఇద్దరు పురుషులు, వాళ్లతో పాటు ఒక అమ్మాయి రోడ్డు సైడ్ నిలబడి ఉన్నారు. రోడ్డు బాగా నీటితో నిండి ఉంది. ఇక ఆ నీటిలో వారు ఆటలు ఆడుతున్నట్లుగా కనిపించారు. దారిన పోయే కార్లకోసం ఎదురుచూస్తూ డ్రైవర్లను తమపై నీళ్లు చల్లమని అడుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వీడియోపై ‘హ్యాపీ పీపుల్’ అని నేమ్ కనిపిస్తుంది. ఇక ఈ వీడియోకి ‘ప్రతి కూలత లేదా అవకాశం? ఇదంతా మైండ్ మరియు యాటిట్యూడ్ కి సంబంధించినది’ అనే క్యాప్షన్ ఇస్తూ ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు.
ఏదైనా పాజిటివ్‌గా ఆలోచించడం.. ఏ సమయాన్నైనా సంతోషంగా ఆస్వాదించడం అనేది నిజంగానే మైండ్‌కి సంబంధించినది. దేన్నైనా ఎంచుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. సంతోషంగా ఉండేవారు ఇలాగే ప్రతిక్షణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ వీడియో అదే సందేశాన్ని ఇస్తోంది.
Adversity or opportunity? It’s all in the mind & all about attitude… ? pic.twitter.com/z1MHdEUhIZ
— anand mahindra (@anandmahindra) May 24, 2023
