Anand Mahindra : ఏ నిముషానికి ఏమి జరుగునో? ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో చూస్తే విధిరాతను నమ్మి తీరాల్సిందే..

అదృష్టవంతుడు..మృత్యుంజయుడు.. ఈ పదాలు ఆ కుర్రాడికి సరిగ్గా సరిపోతాయి. రెప్పపాటులో ఓ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోగలిగితే ఇలాగే కదా అంటారు. ఇలాంటి సందర్భాల్లో విధిని నమ్మాల్సి వస్తుందంటున్నారు వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా.

Anand Mahindra : ఏ నిముషానికి ఏమి జరుగునో? ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో చూస్తే విధిరాతను నమ్మి తీరాల్సిందే..

Anand Mahindra

Anand Mahindra : కొంతమంది అంటూ ఉంటారు.. ఈ రోజు చాలా పెద్ద ప్రమాదం నుంచి బతికి బయటపడ్డాము అని. అలాంటి సందర్భాల్లో విధి రాతని నమ్మాల్సి వస్తుంది.. వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ వీడియో షేర్ చేసారు. అది చూస్తే విధిరాతని నమ్మి తీరాలి.

Rajamouli : పాకిస్తాన్ నాకు పర్మిషన్ ఇవ్వలేదు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ కు రాజమౌళి సంచలన రిప్లై..

భూమి మీద నూకలు ఉన్నాయి అంటారు. ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో షేర్ చేసిన ఓ వీడియో చూస్తే అదే అనిపిస్తుంది. ఓ కుర్రాడు ఫుట్ పాత్ ఫెన్స్ పట్టుకుని కాసేపు నిలబడ్డాడు. వెంటనే అక్కడి నుంచి నడుస్తూ రెండు అడుగులు వేసాడో లేదో రెప్పపాటులో ఒక కారు వచ్చి ఫెన్స్‌ని..చెట్టుని గుద్ది ఆగిపోయింది. ఆ కుర్రాడు అక్కడే ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. నిజంగా అతను చాలా అదృష్టవంతుడు అనిపిస్తుంది.

ఈ వీడియో పాతదే అయినా ఆనంద్ మహీంద్రా షేర్ చేయడంతో మళ్లీ వైరల్ అవుతోంది. ‘విధిరాతను నమ్మని వారు ఇలాంటి సంఘటనలు చూసి ఒకసారి ఆలోచించాలి’.. అని ట్యాగ్ చేస్తూ ఆయన షేర్ చేసిన వీడియోపై చాలామంది కామెంట్లు పెడుతున్నారు.

Anand Mahindra : నిమిషాల్లో వేలాది వేడి వేడి ఇడ్లీలు రెడీ .. వావ్ అంటున్న ఆనంద్ మహీంద్రా

‘మీరు చెప్పింది అక్షరాల నిజం’ అని కొందరు.. ‘నిజంగా ఆ కుర్రాడి విషయంలో జరిగిన సంఘటన చూస్తే విధిరాతను తప్పక నమ్మాలని’ మరి కొందరు రిప్లై ఇచ్చారు. మొత్తానికి ఆ కుర్రాడు మృత్యుంజయుడు అయ్యాడు.