Anand Mahindra : నిమిషాల్లో వేలాది వేడి వేడి ఇడ్లీలు రెడీ .. వావ్ అంటున్న ఆనంద్ మహీంద్రా

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ లో మరో ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేశారు. టాలెంట్ ఎక్కడున్నా ప్రోత్సహించే ఆనంద్ మహీంద్రా..ఈసారి వేడి వేడి ఇడ్లీలో తయారు చేసే వీడియోవైరల్ అవుతోంది.

Anand Mahindra : నిమిషాల్లో వేలాది వేడి వేడి ఇడ్లీలు రెడీ .. వావ్ అంటున్న ఆనంద్ మహీంద్రా

Anand Mahindra twitter

Anand Mahindra : ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ లో మరో ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేశారు. టాలెంట్ ఎక్కడున్నా ప్రోత్సహించే ఆనంద్ మహీంద్రా..ఈసారి వేడి వేడి ఇడ్లీలో తయారు చేసే వీడియోను పోస్ట్ చేశారు. నెటిజన్లను ఆకట్టుకునే వీడియోలో షేర్ చేయటంతో ఆనంద్ మహీంద్రా ముందుంటారు. తన దృష్టికి వచ్చిన ఆసక్తికర విషయాలూ షేర్ చేస్తు వారిని మరింతగా ప్రోత్సహిస్తుంటారు. తాజాగా వేడి వేడి ఇండ్లీల వీడియోను తీసుకొచ్చిన ఇడ్లీల వీడియో వైరల్ అవుతోంది…

ఓ వ్యక్తి భారీ సంఖ్యలో చకచకా ఇడ్లీలు వేస్తున్న వీడియో. సదరు వ్యక్తి ఇడ్లీ మౌల్డ్‌లో పిండిని ఏకంగా ఓ పేద్ద పిండి డబ్బా వేయడం, తరువాత వాటిని ఇడ్లీ గుంతల్లో సరిచేయటం ఆ వాటిని మిషన్ లో సర్ధటం తరువాత ఇడ్లీలు ఉడికాయో లేదో చెక్ చేయటం ఇలా ప్రతీ పనీ చకచకా చేసేస్తున్నాడు. అలా తయారు చేసిన ఇడ్లీల్లో కొన్నింటిని ఓ ఆవుకు పెట్టాడు.

వేడి వేడి ఇడ్లీలను చకచకా తయారు చేసే వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఓ ఆసక్తికర వ్యాఖ్య కూడా చేశారు. ‘‘ఇళ్లల్లో ఆడవాళ్లు నెమ్మదిగా, శ్రద్ధగా ఇడ్లీలు వేయడం మనం చూశాం. మరోవైపు..వ్యాపారం చేసే వాళ్లు ఇలా భారీ స్థాయిలో ఇడ్లీలు సిద్ధం చేస్తుంటారు. ఇడ్లీలు సిద్ధం చేసే పద్ధతి ఏదైనప్పటికీ.. అందులో ఓ మానవీయకోణం, భారతీయత కొట్టొచ్చినట్టు కనబడుతుంది’’ అంటూ రాసారు. ఈ వేడి వేడి ఇడ్లీల వీడియో భారీ సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. నెటిజన్ల కామెంట్లు కూడా వారి వారి స్టైల్లో ఉన్నాయి.