Antarctica : ఇలాంటి భయానకమైన పరిస్థితుల్లో మీరు పనిచేయగలరా?

అక్కడ బయటకు వెళ్లే పరిస్థితి కాదు.. ఇంటి డోర్ కూడా మూయలేని పరిస్థితి.. భయంకరమైన మంచుతో కూడిన గాలుల్లో రోజు పనిచేయడం అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే చలికి వణుకు కాదు.. భయంతో వణుకు పుడుతుంది.

Antarctica

typical workday in Antarctica : కొంచెం చలి ఎక్కువగా ఉంటేనే అడుగు తీసి బయటపెట్టడానికి ఆలోచిస్తాం. అదే అంటార్కిటికాలో పరిస్థితి పూర్తి భిన్నం. సాధారణ పనిదినం భయంకరంగా ఉంటుంది. వణుకుపుట్టించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Kedarnath: మంచుతో నిండిపోయిన కేదార్‌నాథ్.. యాత్రకు రిజిస్ట్రేషన్ల నిలిపివేత

శీతాకాలంలో చలిని తట్టుకోలేకపోతుంటాం. అంటార్కిటాలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. భయంకరంగా వీచే చలిగాలులు.. మంచు తుఫానుల మధ్య పనిచేయడం చాలా కష్టం. అక్కడ ఉండేవారి ప్రాణాలకు నిత్యం ఒక పరీక్ష అని చెప్పాలి. 47వ పోలీష్ అంటార్కిటిక్ ఎక్స్‌పెడిషన్‌కు అధిపతి అయిన టోమాస్జ్ కుర్జాబా ఇటీవల షేర్ చేసిన వీడియో చూస్తే భయం వేస్తుంది. tomaszkurczaba తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ‘అంటార్కిటికాలో సాధారణ పనిదినం’ అనే శీర్షికతో వీడియోను పంచుకున్నారు.

 

కింగ్ జార్జ్ ద్వీపంలో క్యాప్చర్ చేయబడిన ఈ క్లిప్ లో ఒక యాత్రికుడు తలుపు ముందు నిలబడి దానిని మూయడానికి ప్రయత్నిస్తాడు. చూసేవారికి కదులుతున్న రైలు డోర్ మూసివేయడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడా? అని అనిపిస్తుంది. కానీ తలుపుకి బయట వీస్తున్న బలమైన మంచుతో కూడిన గాలి అని తర్వాత మనకు అర్ధమవుతుంది. ఆ సమయంలో అతనికి వేరే వ్యక్తి సాయం చేసేందుకు చేయి అందిస్తాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

Heavy Snow Fall : జమ్మూకశ్మీర్ లో ముంచుకొచ్చిన మంచు ఉప్పెన

ఈ వీడియోలో చాలామంది నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ‘నిజంగా అతను రైలులో ఉన్నాడని అనుకున్నాను’ అంటూ చాలామంది అభిప్రాయపడ్డారు. నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి నిత్యం ఓ పరీక్షలా పనిచేసేవారి గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు