Viral News (AI Image)
Viral News: తల్లీ, కొడుకుల అనుబంధం ఎంత వర్ణించినా తక్కువే. కొడుక్కి ఏ చిన్న సమస్య వచ్చినా తల్లి తల్లడిల్లిపోతుంది. తన కొడుకు జీవితంలో ఉన్నత శిఖరాలను అదిరోహించాలని కలలు కంటుంది. అందుకోసం ఆమె జీవితాన్నిసైతం త్యాగం చేస్తుంది. భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడైనా తల్లీకొడుకుల అనుబంధం అలానే ఉంటుంది. కానీ, కలియుగంలో ఏదైనా జరగొచ్చునని ఈ సంఘటన రుజువు చేస్తోంది. ఓ తల్లి తన సొంత కొడుకును పెళ్లి చేసుకుంది. అయితే, వీళ్ల కథ వింటే అయ్యో పాపం అనాల్సిందే. (Viral News) పూర్తి వివరాల్లోకి వెళితే..
ఓ మహిళ ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొన్ని సంవత్సరాల క్రితం పుట్టిన వెంటనే తన బిడ్డను దత్తత ఇచ్చింది. ఆ తరువాత ఆ బిడ్డకు ఆమెకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దశాబ్దాల తరువాత ఆ మహిళకు 21ఏళ్ల యువకుడు పరిచయం అయ్యాడు. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. వయస్సులో తేడాఉన్నప్పటికీ ప్రేమలో ఉన్న వారిద్దరూ పెండ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ, ఇక్కడే అసలు రహస్యం వెలుగులోకి వచ్చింది. దీంతో వారిద్దరి మైండ్ బ్లాక్ అయినంత పనైంది.
ఆ జంట తమ పిల్లల భవిష్యత్తు గురించి చట్టపరమైన సంప్రదింపుల సందర్భంగా డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు వారికి దిగ్భ్రాంతికరమైన విషయం తెలిసింది. డీఎన్ఏ పరీక్షల్లో తాను పెళ్లి చేసుకున్న యువకుడు తన సొంత కొడుకని తెలిసింది. 36ఏళ్ల క్రితం తన మొదటి భర్తతో ఆమెకు పుట్టిన కొడుకు అని డీఎన్ఏ ఫలితాల్లో తేలింది.
సదరు మహిళ మాట్లాడుతూ.. నేను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది తన కొడుకుతోనే అని తెలిసిన వెంటనే ఏం చేయాలో నాకు తోచలేదు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యాను. 2015లో తనను కలిశాను. అప్పుడు అతనికి 21ఏళ్లు. 2016లో పెళ్లి చేసుకున్నాం. ప్రస్తుతం మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ప్రస్తుతం ఆ జంట విడిపోయినట్లు తెలిసింది. వారి పిల్లలు ప్రస్తుతం మహిళ వద్దే ఉంటున్నారు.
ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె చేసిన దానిలో తప్పులేదని చెబుతుండగా.. కొందరు సదరు మహిళను విమర్శిస్తూ పోస్టులు చేస్తున్నారు.