Jupiter: గురుడిపై అత్యంత ప్రకాశవంతమైన మెరుపు.. వీడియో ఇదిగో

సూర్య కుటుంబ చరిత్రను అర్థం చేసుకోవడానికి ఈ మెరుపులు చాలా కీలకమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Jupiter - Bright Flash

Jupiter – Bright Flash: గురు గ్రహంపై అత్యంత ప్రకాశవంతమైన మెరుపులాంటి వెలుగును జపాన్‌(Japan)కు చెందిన యువ ఖగోళ శాస్త్రవేత్త టడావో ఓహ్సుగీ రికార్డు చేశారు. గురుడి వాతావరణంపై రికార్డు చేసిన అత్యంత ప్రకాశవంతమైన వెలుగుల్లో ఇది ఒకటని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

గత నెలలో దీన్ని రికార్డు చేసిన అనంతరం ఈ దృశ్యాన్ని క్యోటో యూనివర్సిటీ ఖగోళ శాస్త్రవేత్త డా.కొ అరిమత్సుకు టడావో ఓహ్సుగీ ఈ-మెయిల్ లో పంపారు. దీనిపై మరింత సమాచారం సేకరించాలని కొ అరిమత్సు భావిస్తున్నారు. గురుడి వాతావరణంపై ఇటువంటి వెలుగు.. సౌర వ్యవస్థ మూలల నుంచి దూసుకొచ్చే గ్రహశకలాలు లేదా తోకచుక్కల వల్ల కనపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఆగస్టు 28న ఏర్పడిన ఈ వెలుగు గురించి డా.కొ అరిమత్సు మరో ఆరు నివేదికలను కూడా అందుకున్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తల వద్ద అడ్వాన్స్‌డ్ టెలిస్కోపులు ఉన్నప్పటికీ వాటితో ఈ వెలుగులను నేరుగా గుర్తించడం అసాధ్యమని డా.కొ అరిమత్సు చెప్పారు. సూర్య కుటుంబ చరిత్రను అర్థం చేసుకోవడానికి ఈ మెరుపులు చాలా కీలకమని అన్నారు.

Water On Moon : చంద్రుడిపై నీరు ఏర్పడటానికి భూమే కారణమా? చంద్రయాన్ -1 డేటా సేకరణతో సంచలన విషయాలు వెలుగులోకి!