United States election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వంలో ముందంజలో భారత సంతతి నేత

రిపబ్లికన్ డిటేట్ పై వచ్చిన మొదటి పోల్ లో పాల్గొన్న 504 మందిలో 28 శాతం మంది వివేక్ రామస్వామికే జై కొట్టారు.

Vivek Ramaswamy

United States election 2024 – Vivek Ramaswamy: అమెరికాలో వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ భారత సంతతి పారిశ్రామికవేత్త, రిపబ్లికన్ పార్టీ ఆశావాహ అభ్యర్థి వివేక్ రామస్వామి (38) పాపులారిటీ రేటింగ్, ఆన్‌లైన్ ఫండ్లు గురువారం ఒక్కసారిగా పెరిగాయి. అధ్యక్ష ఎన్నికలకు ఏ అభ్యర్థిని నిలబెట్టాలన్న విషయాన్ని తేల్చేందుకు అమెరికాలోని రిపబ్లికన్(Republican), డెమొక్రటిక్ పార్టీ(Democratic Party)లు తమ ప్రణాళికలను అమలు చేస్తున్నాయి.

తాజాగా, వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ నుంచి ఆశావాహ అభ్యర్థుల డిబేట్లో పాల్గొన్నారు. ఆయన ఇందులో అద్భుతంగా మాట్లాడి అందరి దృష్టినీ ఆకర్షించారు. డిబెట్ ముగిసిన ఒకే ఒక్క గంటలో ఆయనకు ఏకంగా రూ.3,72,03,525 ఫండ్స్ వచ్చాయి. సగటు విరాళం రూ.3,141గా ఉంది. రిపబ్లికన్ పార్టీ నుంచి డిబేట్‌కి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరుకాలేదు.

అభ్యర్థిత్వం విషయంలో వివేక్ రామస్వామికి రిపబ్లికన్ పార్టీ నుంచి న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీస్, మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్, దక్షిణ కరొలినా గవర్నర్ నిక్కీ హేలీ పోటీనిస్తున్నారు. నిక్కీ హేలీ కూడా భారత సంతతి నాయకురాలన్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వంపై నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి మధ్య తాజాగా జరిగిన చర్చలో పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు.

అమెరికా విదేశాంగ విధానాలపై నిక్కీ హేలీ మాట్లాడుతూ వివేక్‌ రామస్వామికి వాటిపై అవగాహన లేదన్నారు. నిక్కీ హేలీ తనపై అవాస్తవ ఆరోపణలు చేశారని వివేక్‌ రామస్వామి అన్నారు. రష్యాతో యుద్ధం చేస్తున్న యుక్రెయిన్‌కు అమెరికా అంత మొత్తంలో సాయం అందించడం సరికాదని అన్నారు.

రిపబ్లికన్ డిటేట్ పై వచ్చిన మొదటి పోల్ లో పాల్గొన్న 504 మందిలో 28 శాతం మంది వివేక్ రామస్వామికే జై కొట్టారు. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ కి 27 శాతం, పెన్స్ కి 13, నిక్కీ హేలీకి కేవలం ఏడు శాతం మందే మద్దతు తెలిపారు. మొదటి రిపబ్లిక్ డిబేట్లో అదరగొట్టిన వివేక్ రామస్వామి అభ్యర్థుల్లో అందరికంటే ముందు వరుసలో నిలిచారని ఫాక్స్ న్యూస్ పేర్కొంది.

Isro offers technology : ఇస్రో టెక్నాలజీతో విశ్వవిద్యాలయాల్లో ర్యాగింగ్ నిరోధం…బెంగాల్ ఛాన్సలర్ సీవీ ఆనందబోస్ వెల్లడి