Warren Buffett: ‘పొంచి ఉన్న మరో మహమ్మారి.. ఎంత వరకూ సిద్ధంగా ఉన్నాం’

అమెరికన్ బిలియనీర్ వారెన్ బఫెట్ రీసెంట్ గా సంచలనమైన కామెంట్లు చేశారు. కొవిడ్-19 కంటే దారుణమైన మహమ్మారి పొంచి ఉందని అన్నారు. ఈ పరిస్థితులకు తగ్గట్లుగా రెడీగా ఉన్నామా అని Berkshire Hathaway సీఈఓ వారెన్ బఫెట్ ప్రశ్నించారు.

Warren Buffett: అమెరికన్ బిలియనీర్ వారెన్ బఫెట్ రీసెంట్ గా సంచలనమైన కామెంట్లు చేశారు. కొవిడ్-19 కంటే దారుణమైన మహమ్మారి పొంచి ఉందని అన్నారు. ఈ పరిస్థితులకు తగ్గట్లుగా రెడీగా ఉన్నామా అని Berkshire Hathaway సీఈఓ వారెన్ బఫెట్ ప్రశ్నించారు. వెల్త్ ఆఫ్ విజ్‌డమ్ అనే టీవీషోకు హాజరైన ఆయన ఇలా మాట్లాడారు.

‘మరో మహమ్మారి దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. న్యూక్లియర్, కెమికల్, బయోలాజికల్, సైబర్ ప్రమాదాలు ఉన్నాయని మనకు తెలుసు. అవి విజృంభిస్తే దేనినైనా తట్టుకోగల శక్తి మనకుందా.. వాటిని ఎదుర్కోవడానికి మనం ఎంత వరకూ సిద్ధంగా ఉన్నాం’ అని ప్రశ్నిస్తున్నారు.

ఎమర్జెన్సీ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలా అని కరోనావైరస్ మహమ్మారి మనకు చూపించింది. ఇంకా క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినా ఎదుర్కొనేందుకు సొసైటీ రెడీగా ఉండాలి. పెద్ద వ్యాపారాలు కొద్ది పాటిగా నష్టపోయినా చిన్నపాటి వ్యాపారాలు పూర్తిగా మునిగిపోయాయని అంటున్నారు.

కొవిడ్-19 కారణంగా ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నం అయ్యాయి. వందల్లో.. వేల్లలో.. లక్షల్లో పెట్టుబడి పెట్టి మొదలుపెట్టిన వ్యాపారాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. అతి దారుణమైన పరిస్థితుల కారణంగా ఎకానమీ కుదేలైంది. మహమ్మారి అనేది అయిపోలేదు. చాలా వరకూ జాగ్రత్త పడుతున్నా ఊహించని స్థాయిలో ఎదుర్కోనున్నాం. అందుకే ముందుగానే సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు