Indus Waters Treaty : నీటి హక్కుపై పాక్ బెదిరింపులు.. సింధు జలాల ఒప్పందంపై మళ్లీ రగిలిన వివాదం

Indus Waters Treaty : గత ఏడాదిలో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన సరిహద్దు ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించిన నేపథ్యంలో భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది.

Indus Waters Treaty

Indus Waters Treaty : సింధు జలాల ఒప్పందం విషయంలో పాకిస్థాన్ మళ్లీ రెచ్చగొడుతోంది. దశబ్దాల నాటి ఈ సింధు జలాల ఒప్పందంపై భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ తమకు కేటాయించిన నీటి వాటాను పాకిస్తాన్ వాడుకోకుండా అడ్డుకునేలా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పాకిస్తాన్ మంత్రి బెదిరించారు.

పాక్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాలిక్ మాట్లాడుతూ.. సింధు జలాల ఒప్పందం కింద తమకు అందాల్సిన నీటి వాటాను ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. ‘మా నీటి హక్కుపై ఎవరైనా చేయి వేస్తే ఆ చేతిని నరికేస్తామని నిరూపించాం’ అంటూ వ్యాఖ్యలు చేయడం మళ్లీ వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు పలు పాకిస్తానీ మీడియా సంస్థల్లోనూ వెలువడ్డాయి. అయితే ఆ వీడియో క్లిప్‌లను ధృవీకరించలేమని నివేదికలు తెలిపాయి.

1960లో సింధు జలాల ఒప్పందం :
2025 పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత్ నిర్ణయించుకుంది. ఈ ఒప్పందం పునరుద్ధరణకు పాకిస్తాన్ తన భూభాగం నుంచి సరిహద్దు ఉగ్రవాద కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని భారత్ సూచించింది.

Read Also : Tamil Nadu Woman : తమిళనాడులో దారుణం.. యూట్యూబ్ చూసి ఇంట్లోనే నార్మల్ డెలివరీ.. మహిళ మృతి.. అసలేం జరిగిందంటే?

1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్తాన్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. సింధు నది వ్యవస్థ అనేది నీటి పంపిణీకి కీలక ఆధారం. దశాబ్దాలుగా ఈ ఒప్పందం కొనసాగుతోంది. తాజాగా నీటి వాటాపై రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తారర్ మాట్లాడుతూ.. సింధు జలాల ఒప్పందం అనేది చట్టబద్ధమైన ఒప్పందంగా పేర్కొన్నారు. ఈ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం లేదా మార్చడం సాధ్యం కాదన్నారు. నదీ జలాలపై అంతర్జాతీయంగా గుర్తించిన హక్కులు కూడా ఉన్నాయని తెలిపారు.

భారత్ తమకు కేటాయించిన నీటి వాటాను పూర్తిగా వాడుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. దాంతో సింధు జలాల అంశం కేవలం నీటి వివాదంగానే కాకుండా భారత్–పాక్ సంబంధాల్లో మరో కీలక ఘర్షణకు కేంద్రంగా మారింది. జల ఒప్పందం ప్రకారం.. తమకు వచ్చే నీటిని రక్షించుకునేందుకు పాకిస్థాన్ కట్టుబడి ఉందన్నారు. నీటి పంపిణీని అడ్డుకునేందుకు భారత్‌కు అనుమతి లేదని మలిక్ తేల్చిచెప్పారు.