Gandhi Statues Vandalised: అమెరికాలో గాంధీ విగ్రహాల ధ్వంసంపై వైట్ హౌజ్ ఆగ్రహం

న్యూయార్క్‌ రిచ్‌మండ్‌ హిల్స్‌లోని శ్రీ తులసి మందిర్‌ వద్ద ఉన్న గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ నెల 3న కూడా దుండగులు అక్కడి గాంధీ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. తాజాగా ఈ నెల 16న ఆ విగ్రహాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లో మరో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అలాగే ఈ ఏడాది జులై 14న కెనడాలో కూడా మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీనిపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది.

White House condemn vandalism of Gandhi statue

Gandhi Statues Vandalised: అమెరికాలో కొద్ది రోజులుగా మహాత్మగాంధీ విగ్రహాలపై జరుగుతున్న దాడిపై వైట్ హౌజ్ ఎట్లకేలకు స్పందించింది. అశాంతి ఊపిరిగా జీవించిన వ్యక్తి విగ్రహాలను ధ్వంసం చేయడం దారుణమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వైట్ హౌస్, న్యూయార్క్ నగర మేయర్ బుధవారం అన్నారు. తాజాగా న్యూయార్క్‭లో జరిగిన ధ్వంసంతో పాటు దీనికి ముందు జరిగిన ఘటనపై ఉమ్మడిగా దర్యాప్తుకు ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ విషయమై వైట్ హౌజ్ ప్రెస్ సెక్రెటరీ కరెన్ జీన్ పీయర్ మాట్లాడుతూ ‘‘సత్యానికి అహింసకు మహాత్మగాంధీ దిక్సూచి అని అందరికీ తెలుసు. శాంతికి ఆయన ఆదర్శం. అధ్యక్షుడు కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అలాంటి వ్యక్తి విగ్రహాలపై దాడి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. దాడి ఎంతటిదనేది కాదు.. ఏ స్థాయిలో జరిగినా కఠిన చర్యలు తప్పవు’’ అని అన్నారు.

న్యూయార్క్‌ రిచ్‌మండ్‌ హిల్స్‌లోని శ్రీ తులసి మందిర్‌ వద్ద ఉన్న గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ నెల 3న కూడా దుండగులు అక్కడి గాంధీ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. తాజాగా ఈ నెల 16న ఆ విగ్రహాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లో మరో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అలాగే ఈ ఏడాది జులై 14న కెనడాలో కూడా మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీనిపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది.

Beti Bachao: కుమార్తెలను కాపాడాలిని చెప్తూ రేపిస్టులను కాపాడుతున్నారు.. బీజేపీపై రాహుల్ ఫైర్