White House లో కరోనా, సెల్ఫ్ క్వారంటైన్ లోకి Trump

  • Publish Date - October 2, 2020 / 10:01 AM IST

White House : వైట్ హౌస్ లో కరోనా కలకలం రేపింది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది మృతి చెందుతున్న సంగతి తెలిసిందే. వైరస్ కట్టడి చేస్తామని, త్వరలోనే వ్యాక్సిన్ తెస్తామని ప్రకటిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన పీఏ హోప్ పిక్స్ కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో ఒక్కసారిగా వైట్ హౌస్ ఉలిక్కిపడింది.



అధ్యక్ష ఎన్నికలు త్వరలో జరుగనున్న సంగతి తెలిసిందే. ట్రంప్, ఆయన పీఏ, ఇతర అధికారులు పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. క్లీవ్ ల్యాండ్ జరిగిన సమావేశంతో సహా పీఏ హోప్ పిక్స్ ప్రయాణం చేశారు. ఈ వార్త తెలుసుకున్న అధికారులు ట్రంప్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. ట్రంప్ సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయినట్లు సమాచారం.



దీనిపై ట్రంప్ ఓ ట్వీట్ చేశారు. చిన్న విరామం తీసుకోకుండా..హోప్ పని చేస్తున్నారని ప్రశంసించారు. కోవిడ్ 19 పాజిటివ్ పరీక్షించారని, తాను పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం quarantine process!లో ఉంటామన్నారు.



త్వరలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని ట్రంప్ భావిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా జో బైడెన్‌ను డెమోక్రాట్లు అధికారికంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. అమెరికా ఎన్నికల ప్రకారం..ముందుగా.. తొలి ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌ జరిగింది.



మంగళవారం జరిగిన ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌లో ట్రంప్, బైడెన్‌ హోరాహోరీగా మాటలయుద్ధం చేసుకున్నారు. డిబెట్ పూర్తయిన అనంతరం తామే గెలుచామని ఇరువురు అభ్యర్థులు ప్రకటించుకున్నారు.