White House Lockdown : వైట్‌హౌస్‌ దగ్గర ఒక్కసారిగా కలకలం.. కారు ప్రమాదంతో లాక్‌డౌన్‌.. ట్రంప్‌ అప్పుడే లోపలే!

White House Lockdown : అమెరికా వైట్‌హౌస్‌ సమీపంలో కారు ప్రమాదం కలకలం రేపింది. ట్రంప్‌ భవనంలో ఉండగానే భద్రతా సిబ్బంది లాక్‌డౌన్‌ విధించారు. అసలేం జరిగిందంటే?

White House Lockdown

  • వైట్‌హౌస్‌లో ట్రంప్‌.. భద్రతా వలయంలోకి దూసుకొచ్చిన కారు
  • కారును అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • జర్నలిస్టులను లోపలికి పంపిన సీక్రెట్‌ సర్వీస్‌

White House Lockdown : అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ దగ్గర అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ కారు ఒక్కసారిగా అదుపుతప్పి భద్రతాపరంగా కీలకమైన ప్రాంతంలోకి దూసుకెళ్లడంతో అక్కడ తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటన జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌హౌస్‌ లోపలే ఉన్నట్లు సమాచారం.. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై తాత్కాలికంగా లాక్‌డౌన్‌ విధించారు..

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సోమవారం వాషింగ్టన్‌ డీసీలోని వైట్‌హౌస్‌ సమీపంలో ఓ సిల్వర్ కలర్ సెడాన్‌ కారు వేగంగా వచ్చి ఫుట్‌పాత్‌ అంచును దాటి సమాచార బోర్డు వద్ద ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం లఫాయెట్‌ స్క్వేర్‌ ఉత్తర భాగంలో చోటుచేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.. కారు ఢీకొన్న వెంటనే వాహనం నుంచి తెల్లటి పొగ వెలువడటం అక్కడున్న వారిని మరింత ఆందోళనకు గురిచేసింది..

Read Also : iPhone 17 Pro Discount : ఐఫోన్ 17 ప్రోపై భారీ డిస్కౌంట్.. ఇలా కొంటే ఏకంగా రూ.17,900 తగ్గింపు.. నిమిషాల్లోనే డెలివరీ..!

ఘటన జరిగిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. కారులో ఉన్న డ్రైవర్‌ను కిందకు దిగాలని ఆదేశించి, నేలపై పడుకోవాలని సూచించారు. మరోవైపు వైట్‌హౌస్‌ భద్రతను పర్యవేక్షించే సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు అక్కడున్న మీడియా ప్రతినిధులను వెంటనే భవనం లోపలికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.

ఈ ఘటనతో వైట్‌హౌస్‌ పరిసరాల్లో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ ప్రమాదం వెనుక అసలు కారణమేంటి? డ్రైవర్‌ ఎవరు? కావాలనే కారుతో దూసుకొచ్చారా? లేక ప్రమాదవశాత్తూ జరిగిందా? అన్న విషయాలు తెలియాల్సి ఉంది.

అయితే, ఆ ప్రాంతంలో వాహనాలు వేగంగా దూసుకెళ్లడానికి వీలులేని విధంగా రోడ్డు నిర్మాణం ఉండటం గమనార్హం.. ఇరుకైన రహదారి, సిగ్నల్‌ వద్ద మలుపు కారణంగా వాహనాల వేగానికి పరిమితులు ఉంటాయి. అయినప్పటికీ కారు భద్రతా పరిధిలోకి ఎలా వచ్చిందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై అధికారులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది..