WHO labels COVID variants: భారత్ అభ్యంతరం.. కొత్త వేరియంట్‌లకు పేర్లు పెట్టిన WHO

ఇండియన్ వేరియంట్ అంటూ ఓ కరోనా వైరస్‌ వేరియంట్‌ను సంబోధించడంపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఈ కొత్త కరోనా వేరియంట్‌ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO).

Who Labels Covid Variant Rampaging Through India As Delta

COVID variants: ఇండియన్ వేరియంట్ అంటూ ఓ కరోనా వైరస్‌ వేరియంట్‌ను సంబోధించడంపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఈ కొత్త కరోనా వేరియంట్‌ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO). కొవిడ్‌ వేరియంట్లను గ్రీక్‌ ఆల్ఫాబెట్‌లు.. ఆల్ఫా, బీటా, గామా తదితర పేర్లతో పిలవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం నిర్ణయం తీసుకుంది.

భారత్‌లో గుర్తించిన కోవిడ్ వేరియంట్లకు పేర్లను సూచించింది. కోవిడ్ వేరియంట్‌ బి.1.617.2ను ‘డెల్టా’ వేరియంట్‌గా.. మరో వేరియంట్ బి.1.617.1కు ‘కప్పా’ వేరియంట్‌గా పేరు పెట్టింది. అయితే, ప్రస్తుతం ఉన్న శాస్త్రీయ పేర్లను కొత్త పేర్లు భర్తీ చేయవని వెల్లడించింది. సైంటిఫిక్‌ పేర్లు విలువైన సమాచారం, పరిశోధనలో ఉపయోగపడతాయని పేర్కొంది. కొవిడ్‌ కొత్త వేరియంట్ల గుర్తింపు, నివేదిక ఇవ్వడంలో ఏ దేశం నిరాకరించకూడదని ఆదేశించింది.

భారత్‌లో వెలుగుచూసిన కొవిడ్‌ వేరియంట్‌ను ఇండియన్‌ వేరియంట్‌ అని పలు దేశాలు పిలవడంపై భారత్‌ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేయగా.. కొత్తగా వెలుగుచూసే వేరియంట్‌లను ఆయా దేశాల పేర్లతో పిలవకూడదని WHO ఇప్పటికే స్పష్టం చేసింది. కొవిడ్‌ వేరియంట్లను గ్రీక్‌ ఆల్ఫాబెట్‌లు.. ఆల్ఫా, బీటా, గామా తదితర పేర్లతో పిలవాలని WHO నిపుణుల బృందం సూచించింది.

ఇవి సాధారణ ప్రజలు సైతం పలకడానికి, చర్చించడానికి సులువుగా ఉంటాయని, బ్రిటన్‌‌లో వెలుగులోకి వచ్చిన కొవిడ్‌ వేరియంట్‌ B1.1.7కు ఆల్ఫాగా, దక్షిణాఫ్రికాలో కనిపించిన వేరియంట్‌ B.1.351కు బీటాగా, బ్రెజిల్‌ వేరియంట్‌ P.1కు గామాగా నామకరణం చేసింది. భారతదేశం అభ్యంతరం వ్యక్తం చేసిన తరువాత వివిధ దేశాలలో వెలుగులోకి వచ్చిన కరోనా వేరియంట్‌కు డబ్ల్యూహెచ్‌ఓ కొత్త పేరు పెట్టింది. అమెరికాలో కనిపించే జాతిని ఎప్సిలాన్ మరియు ఐయోటాగా పిలుస్తున్నారు.