WHO BP Guidelines :మారిన బీపీ లెక్కలు..ఇకనుంచి 140/90 లోపు ఉంటే నార్మల్ :WHO మార్గదర్శకాలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రక్తపోటు (బీపీ)కు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకనుంచి 140/90 లోపు ఉంటే సాధారణమని వెల్లడించింది.

WHO revises blood pressure control guidelines : ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రక్తపోటు (బీపీ)కు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకనుంచి 140/90 లోపు ఉంటే సాధారణమని వెల్లడించింది. ఇప్పటి వరకు రక్తపోటు 120/80 ఎంఎంహెచ్‌జీ (మిల్టీమీటర్స్ ఆఫ్ మెర్క్యురీ) గా ఉంటే సాధారణంగా పరిగణించేవారు. అది దాటితే రక్తపోటు ఉన్నట్టుగానే పరిగణించేవారు. ఈ క్రమంలో బీపీ లెక్కల్లో మార్పులొచ్చాయి. దాదాపు 21 ఏళ్ల తరువాత డబ్ల్యూహెచ్ఓ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మార్పులు చోటుచేసుకున్న లెక్కల్లో భాగంగా ఇకపై 140/90 లోపు ఉంటే దానిని సాధారణంగానే పరిగణిస్తారు. డయస్టాలిక్,సిస్టోలిక్ కు సంబంధించి కొన్ని మార్పులు చేసింది.

డయస్టాలిక్ పోటు 90 ఎంఎంహెచ్‌జీ, అంతకుమించి రెండు రోజులపాటు ఉంటేనే దానిని రక్తపోటుగా పరిగణించాలని డబ్ల్యూహెచ్ఓ తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. అలాగే..ధూమపానం, మద్యం అలవాటు ఉన్నవారు. ఒకే చోట అదే పనిగా కూర్చుని పనిచేయడం, వ్యాయామం చేయకపోవడం, వంశపారంపర్యంగా బీపీ వచ్చే అవకాశం వారికి, గుండె జబ్బులున్న వారికి సిస్టోలిక్ పోటు గరిష్ఠంగా 130 ఎంఎంహెచ్‌జీ వరకు ఉండొచ్చని స్పష్టం చేసింది.

ప్రపంచవ్యాప్తంగా 1.4 బిలియన్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతుండగా, వారిలో 14 శాతం మందిలో మాత్రమే బీపీ అదుపులో ఉంది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ 21 ఏళ్ల తర్వాత బీపీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయడం గమనించాల్సిన విషయం.అధిక రక్తపోటు బాధితుల్లో దాదాపు 46 శాతం మందికి తమలో ఆ సమస్య ఉన్నట్టు గుర్తించలేరు. అందుకే బీపీని ‘సైలెంట్ కిల్లర్’ అని అంటాం. బీపీ ఉందని గుర్తించే సమయానికే కొన్ని సార్లు హార్ట్ ఎటాక్ కు గురికావటం వంటిది జరుగుతుంటుంది. అదే కాకుండా అధిక రక్తపోటు వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. కాబట్టే 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు తరచూ బీపీని చెక్ చేయించుకోవడం మంచిది. 40 ఏళ్లు దాటిన వారు తప్పనిసరిగా బీపీని తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి.

బీపీ నార్మల్ అంటే?
కాగా బీపీ అనేది మనకు తెలియకుండానే ప్రాణాల్ని హరించివేస్తుంది.బీపీ ఉందని గుర్తించేలోపే కొన్నిసార్లు జరగరాని ప్రమాదాలకు కారణమవుతోంది. సాధారణంగా బీపీ రీడింగ్స్ 120/80 mmHg ఉంటే నార్మల్ ఉన్నట్టు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది. కనుక బీపీ రీడింగ్ 130/90 mmHg ఉంటే హై బీపీ ఉన్నట్టు, అలాగే 90/60 mmHg ఉంటే దాన్ని లో బీపీగా (Low BP) భావిస్తారు.ఈ క్రమంలో బీపీకి సంబంధించి WHO విడుదల చేసిన మార్గదర్శకాలు విడుదల అయ్యాయి.

మీ ఇంట్లో బీపీ రీడింగ్స్ తీయటం ఎలాగో ముందే తెలుసుకుని తీసుకుంటే బెటర్. కానీ బీపీ చెక్ చేసే క్రమంలో మీరు మీ చెయ్యిని ఎలా ఉంచారు? మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది? వంటివి బీపీ రీడింగ్ ను ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోవాలి. అంతేకాదు మీ వయసును కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఏ వయస్సు వారికి ఎంత బీపీ ఉండాలి? అనే విషయం కూడా తెలుసుకోవాలి.బీపీ చూసుకునే క్రమంలో పలు కీలక అవగాహన పొందటం చాలా ముఖ్యం.

ఆర్మ్ పొజిషన్: బీపీ చెక్ చేసే సమయంలో మీ ముంజేయిని, మోచేతిని ఎలా పెట్టారన్నది చాలా ముఖ్యం. బీపీ చెక్ చేసే సమయంలో మీరు చేతులను కదిలించటం ద్వారా కూడా రీడింగ్స్ లో హెచ్చుతగ్గులు రావచ్చు. మోచేయిన పొందించి ఉంచి తీసిన రీడింగ్ కు, గాల్లో అలా మీ చేయిని పెట్టి తీసిన రీడింగ్ కు మధ్య తేడా ఉంటుంది. అందుకే చేతికి సపోర్ట్ ఇచ్చి, మోచేతిని కుర్చీ లేదా టేబుల్ పై ఆన్చి ఉంచాక, గుండెకు సమాంతరంగా చేయిని ఉంచినప్పుడే బీపీ చెక్ చేయాలి. ఏది ఏమైనా బీపీ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది.లేదంటే ప్రాణాలకే ప్రమాదం.

 

 

ట్రెండింగ్ వార్తలు