కొవిడ్-19 వైరస్ గాల్లో నుంచి ఇతరులకు వ్యాపిస్తుందనే మాటను కొట్టిపారేసింది WHO(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్). కేవలం తుంపర్ల ద్వారానే సంక్రమిస్తుందని గాలి వల్ల రాదని వెల్లడించింది. కరోనా పేషెంట్ కు దగ్గర్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి మాట్లాడినా.. దగ్గినా.. తుమ్మినా బాగా దగ్గరగా ఉంటేనే ఎఫెక్ట్ అవుతుందని కన్ఫామ్ చేసింది.
తుమ్మినప్పుడు గాల్లోకి వెళ్లే తుంపర్లు కాసేపటి వరకే ఉంటాయి. అవి బరువెక్కువగా ఉండటంతో కొద్ది క్షణాలు మాత్రమే గాల్లో ఉంటాయి. తుంపర్లు ఉండే పరిమాణాన్ని బట్టి అవి వ్యాప్తి చెందుతాయి. కరోనా సోకిన వ్యక్తికి ఒక మీటర్ కంటే తక్కువ దూరంలో ఉన్నప్పుడు తుమ్మినా, దగ్గినా 5నుంచి 10మైక్రోన్ల సైజులో మన శరీరం పైన పడే ప్రమాదముంది. లేదంటే అటువంటి తుంపర్లు పడిన ప్రదేశాన్ని మనం తాకితే వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
5 మైక్రోన్స్ కంటే తక్కువ వ్యాసం ఉంటే గాల్లోనే ఒక మీటర్ దూరం వరకూ తిరుగుతుంటాయి. కొన్ని సార్లు చాలా సమయం వరకూ అవి సజీవంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. గాలి ద్వారా వ్యాప్తి చెందే సందర్భాలు చాలా అరుదు.
ట్రీట్ మెంట్ జరుగుతున్నప్పుడు గాలిని పైపుల ద్వారా అందించే ప్రక్రియలో లేదంటే వెంటిలేటర్ల ద్వారా ట్రీట్ మెంట్ జరుగుతున్న సమయంలో పైపు లీకేజి ద్వారా గాల్లోకి రోగి నుంచి వచ్చే తుంపర్లు వైరస్ ను వ్యాప్తి చేయవచ్చు. అంతేకానీ, కరోనా వైరస్ ఉన్న వ్యక్తిని తాకిన గాలి మనల్ని తాకితే వైరస్ వస్తుందనుకోవడం అపోహ మాత్రమేనని డబ్ల్యూహెచ్ఓ కొట్టిపారేసింది.
ప్రపంచవ్యాప్తంగా 175దేశాల్లో ఇప్పటి వరకూ 10లక్షల 2వేల 159కేసులు నమోదుకాగా, 51వేల 485 మృతులు సంభవించాయి.