కరోనా వాస్తవ డేటా ఇవ్వడానికి ప్రయత్నించాలి : WHO

భారతదేశంలో కరోనా సంక్రమణ మరియు మరణాల రేటు ఆందోళనకరంగా ఉందని WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. భారత్ లో ఉన్న డబుల్ మ్యూటెంట్ వైరస్

soumya swaminathan:భారతదేశంలో కరోనా సంక్రమణ మరియు మరణాల రేటు ఆందోళనకరంగా ఉందని WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. భారత్ లో ఉన్న డబుల్ మ్యూటెంట్ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుందని, దీనివల్ల ఇన్‌ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయని అన్నారు. అందువల్ల ప్రజలు ఖచ్చితంగా టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక అన్ని దేశాలు కరోనా ఇన్ఫెక్షన్లు, మరణాలపై తక్కువ డేటాను నివేదించాయని. వాస్తవ గణాంకాలను ప్రభుత్వాలకు ఇవ్వడానికి ప్రయత్నాలు చేయాలని ఆమె సూచించారు.

ప్రస్తుతం మన దృష్టి అంతా వైరస్ సంక్రమణ వ్యాప్తిని ఆపడం మరియు దాని వలన కలిగే మరణాలను అరికట్టడంపై ఉండాలని అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ అన్ని రకాల్లో ప్రభావవంతంగా ఉంటుందని అన్నారు. ప్రాణాంతక వ్యాధికి వ్యతిరేకంగా వ్యాక్సిన్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అయితే, ఇది సంక్రమణను పూర్తిగా నిరోధించలేదని కూడా ఆమె స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు