Ayatollah Khamenei : అయతుల్లా ఖమేనీ హతం.. తరువాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు.. ప్రముఖంగా వినిపించే పేర్లు ఇవే..
Ayatollah Ali Khamenei : ఖమేనీ మృతితో ఇరాన్‌కు కాబోయే సుప్రీం లీడర్ ఎవరు అనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే, ఈ జాబితాలో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
- Harishth Thanniru
- Published On : March 1, 2026 / 09:55 AM IST
Ayatollah Ali Khamenei
Ayatollah Khamenei : అమెరికా – ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని ఇరాన్ ధృవీకరించింది. ఖమేనీ మృతితో ఇరాన్‌కు కాబోయే సుప్రీం లీడర్ ఎవరు అనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.
ఇస్లామిక్ రిపబ్లిక్‌లో ఇరాన్ సుప్రీం నాయకుడు అత్యంత అధికారాన్ని కలిగిన ఉంటారు. ఆయన సాయుధ దళాలు, భద్రతా సేవలు, కీలక సంస్థలు ఆయన ఆధీనంలోనే ఉంటాయి. దేశ విదేశాంగ, దేశీయ విధానాలను సుప్రీం లీడర్ రూపొందిస్తారు. 86ఏళ్ల ఖమేనీ 1989 నుంచి ఇరాన్ కు సుప్రీం లీడర్ గా కొనసాగుతున్నారు. ఆయన సుధీర్ఘ పదవీకాలంలో అనేక సంక్షోభాలు, యుద్ధాలు, రాజకీయ గందరగోళాన్ని ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్, అమెరికా సైనం ఇరాన్ పై విరుచుకుపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖమేనీ స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.
ఇరాన్ రాజ్యాంగం ప్రకారం.. 88మంది సీనియర్ ఇస్లామిక్ పండితులతో కూడిన శక్తివంతమైన క్లరికల్ బాడీ అయిన నిపుణుల అసెంబ్లీ నూతన ఇరాన్ సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే బాధ్యతను కలిగి ఉంది. ఖమేనీ మృతితో ఆయన స్థానాన్ని భర్తీ చేసే వారిలో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ప్రముఖంగా వినిపించే పేరు హోజ్జత్ ఓల్ ఎస్లామ్ మొహసేన్ కోమి. ఇతన్ని ఖమేనీకి సన్నిహిత సలహాదారుగా పరిగణిస్తారు. సుప్రీం నాయకుడి నెట్‌వర్క్‌తో లోతైన పరిచయం ఉన్న, విశ్వసనీయమైన వ్యక్తిగా పేరుంది. ఖమేనీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే సత్తా కలిగిన నాయకుడిగా హోజ్జత్-ఓల్-ఎస్లామ్ మొహసేన్ కోమికి మద్దతు ఉంది.
ఆయతుల్లా అలిరేజా అరాఫీ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అరాఫీ నిపుణుల అసెంబ్లీ, గార్డియన్ కౌన్సిల్ రెండింటిలోనూ నాయకత్వ పాత్రలు పోషించిన సీనియర్ మతాధికారి. అతను ఇరాన్ సెమినరీ వ్యవస్థకు కూడా నాయకత్వం వహిస్తున్నాడు. అంతేకాక.. ఆయతుల్లా మొహ్సేన్ అరకి పేరు కూడా ఖమేనీ తరువాత ఇరాన్ సుప్రీం లీడర్ స్థానంకు తగిన వ్యక్తిగా ప్రముఖంగా వినిపిస్తోంది. మొహ్సేన్ అరకి నిపుణుల సభలో దీర్ఘకాల సభ్యుడిగా ఉన్నాడు. వీరితోపాటు అయతుల్లా ఘోలం హోస్సేన్ మొహసేని ఈజీ, అయతుల్లా హషేమ్ హోస్సేనీ బుషెహ్రీ పేర్లు కూడా ఇరాన్ సుప్రీం లీడర్ రేసులో వినిపిస్తున్నాయి.
