Israel Coalition
Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును పదవి నుంచి తొలగించడం దాదాపు ఖాయమైంది. ఇజ్రాయెల్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపక్షం ఒప్పందం చేసుకుంది. ఇజ్రాయెల్‌లో ప్రతిపక్షం నెతన్యాహును పదవి నుంచి తొలగించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఆ దేశ అధ్యక్షుడు రేవన్ రివ్లిన్ స్వయంగా ప్రకటన చేశారు.
ప్రతిపక్ష పార్టీలు ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నాయని, వారు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఇజ్రాయెల్‌లో నెతన్యాహు పన్నెండేళ్లుగా ప్రధాని పదవిలో ఉన్నారు.
అయితే ఏడు పార్టీలతో జట్టుకట్టిన ప్రతిపక్షనేత ఎయిర్ లాపిడ్.. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్రపతికి ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు బలం ఉందని, విస్తృత సంకీర్ణ కూటమిని కూడగట్టడంలో మేం విజయం సాధించామని చెప్పడానికి చాలా గర్వంగా ఉందని మెయిల్‌లో రాసుకొచ్చారు.
ఇదంతా జరిగినప్పుడు రాష్ట్రపతి సాకర్ కప్ ఫైనల్ చూస్తున్నారు. దీంతో లాపిడ్‌ను కూడా అభినందించారు. లాపిడ్ ముఖ్య మిత్రుడు జాతీయవాది నాఫ్తాలి బెన్నెట్ ఇప్పుడు ఇజ్రాయెల్ కొత్త ప్రధానమంత్రి అవుతారు.
రొటేషన్ పద్ధతితో అధికారంలోకి విపక్షాలు రానున్నాయి. మొదటి రెండేళ్లు ప్రధాన విపక్ష నేత నఫ్తాలీ బెనెట్, రెండేళ్ల తర్వాత తను ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు లాపిడ్ చెప్పారు. నెతన్యాహు వ్యతిరేక కూటమిని మరింత బలంగా కూడగట్టుకునేందుకు లాపిడ్ ఏడు పార్టీలతో ఒప్పందాలు చేసుకున్నారు.
కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకార కార్యక్రమం 10-12 రోజుల మధ్య జరుగుతుందని, ఈలోపుగా బెంజమిన్ నెతన్యాహు తన ప్రభుత్వాన్ని కొనసాగించడానికి అన్ని ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.