ప్రపంచం మెత్తం కరోనా దెబ్బకు లాక్ డౌన్ అయిన సమయంలో చైనా మాత్రం చిన్నగా ఆంక్షలను ఎత్తివేస్తోంది. నెలల లాక్‌డౌన్‌కు తాజాగా స్వప్తి పలికింది. ముందులాగే ప్రజలు ప్రశాంతంగా జీవనం గడపొచ్చని ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన హుబే ఫ్రావిన్స్ లో ట్రావెల్ ఆంక్షలను ఎత్తివేశారు.
అయితే చావు తప్పి కన్ను లొట్టపోయినా చైనీయుల్లో మాత్రం ఏ మార్పు రాలేదు. ఏ ఇష్టానుసార ఆహార శైలితో ఇబ్బందులు పడ్డారో.. మళ్లీ అదే వైపు అడుగులు వేస్తున్నారు. చప్పబడిన నాలుకలకు పని చెబుతున్నారు. భయంకరమైన కరోనా వైరస్‌ను ప్రపంచ దేశాలకు అంటగట్టి, దాన్నుంచి బయటపడ్డామన్న విజయోత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నారు. కుక్కలు, పిల్లులు, తేళ్లు, గబ్బిలాల మాంసం కోసం క్యూలు కడుతున్నారు.
శనివారం సౌత్ వెస్ట్ చైనాలోని గుయ్‌లిన్‌లో కుక్కలు, పిల్లులు, తేళ్లు, గబ్బిలాలు, పాములు ఇతర రకాల క్రిమి కీటకాలు, జంతువుల మాంసం షాపుల వద్ద పెద్ద సంఖ్యలో జనం క్యూలు కట్టారు. దీనికి తోడు పలు రకాల జీవుల మాంసంతో తయారు చేసిన చైనా ఆయుర్వేద షాపులు సైతం రోడ్లమీద దర్శనమిచ్చాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు కొన్ని సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ‘థూ, మీరిక మారరారా? వీళ్లు చచ్చినా బాగుపడరంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.