Trump నోరు మూసుకో.. అని తిట్టి పోసిన Joe Biden

Democrat Joe Biden నోరు మూసుకోమని President Donald Trump అన్నారు. అమెరికన్ ఎన్నికలకు 35 రోజుల ముందుగా జరిగిన ఓపెనింగ్ డిబేట్ లో ఇద్దరూ ముఖాముఖీగా వాదనలకు దిగారు. కంగారుకు గురైన ఓహియో.. చాలా కోపం తెచ్చుకున్నాడు. మొత్తం మూడు చర్చలు భాగంగా జరిగిన మొదటి అధ్యక్ష చర్చ క్లీవ్‌ల్యాండ్‌ లోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ విశ్వవిద్యాలయం ఆవరణలో గంటన్నర పాటు జరిగింది.

24 రోజుల వ్యవధిలో మిగతా రెండు చర్చలు కూడా జరగనున్నాయి. రెండవ చర్చ మయామిలో అక్టోబర్ 15న, మూడవ చర్చ బెల్మాంట్ విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 22న జరగనుంది. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3న జరగనున్నాయి. ఈ సమావేశంలో ట్రంప్-జో బిడెన్ ల మధ్య సాంప్రదాయబద్ధంగా షేక్ హ్యాండ్స్ కూడా జరగలేదు. కొవిడ్ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకున్నారు.

ట్రంప్.. 77ఏళ్ల బిడెన్ పై సీరియస్ అయ్యాడు. ర్యాడికల్ లెఫ్ట్ అంటూ.. చిటికిన వేలు చూపిస్తూ వ్యంగ్యంగా మాట్లాడాడు. పర్సలన్ లైఫ్ గురించి కూడా మాట్లాడుతూ.. జో బిడెన్ కొడుకుల్లో ఒకరు చాలా అవినీతి పరుడుని.. మోసగించడానికి ప్రయత్నించొద్దంటూ వ్యాఖ్యలు చేశారు.

దీంతో అబద్ధాల కోరు, జాత్యంహకారి, బూతులు మాట్లాడేవాడు అంటూ ట్రంప్ ను తిట్టాడు బిడెన్. అంతేకాకుండా ట్రంప్ ను.. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కుక్కవి అంటూ వెటకారం చేశాడు. ఆ తర్వాత ట్రంప్.. తన ఎకనామిక్ రికార్డ్ ను గట్టిగా వినిపించాడు. ఇలా వాదన పెరుగుతుండగా ట్రంప్ ను.. జో బిడెన్ నువ్వు కాస్త నోరు మూసుకుంటావా.. అంటూ వారించాడు.