Viral Video : అపరిచితుడికి సాయం చేస్తానన్న మహిళ.. చివర్లో ఊహించని ట్విస్ట్
ఓ మహిళ యొక్క మనస్తత్వం తెలుసుకునేందుకు అపరిచిత వ్యక్తి ఆమెను సాయం కోరాడు. దానికి ఆమె వెంటనే ఒప్పుకుంది. చివర్లో అపరిచితుడు ఆమెకి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.
- kunduru Vinod
- Published On : October 5, 2021 / 06:52 PM IST
Viral Video
Viral Video : పొట్టకూటి కొసం చాలామంది బిక్షాటన చేస్తుంటారు. కొందరు పనిచేసే శక్తి ఉన్నా.. బిక్షమెత్తుతుంటారు. మరికొందరు తమ పర్సు పోయిందని.. మీరు సాయం చేస్తే తిరిగి ఇంటికి వెళ్ళాక మీ డబ్బు మీకు తిరిగి ఇస్తానని చెబుతుంటారు. అయితే ఇటువంటి వారిలో చాలామంది ఫేక్ వ్యక్తులే ఉంటారు. వీరు ఎక్కువగా రద్దీ ప్రదేశాలు.. దేవాలయాల వద్ద కనిపిస్తుంటారు. అయితే నిజంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం చేస్తే ఎదో ఒక మంచి జరుగుతుందని పెద్దలు అంటుంటారు. ఇలానే ఓ షాపింగ్ మాల్ లో వస్తువులు కొంటున్న మహిళ దగ్గరకు వచ్చిన ఓ వ్యక్తి తనకు ఆకలిగా ఉందని.. వ్యాలెట్ తెచ్చుకోలేదని.. తనకేదైనా తినిపించాలని కోరాడు.. దీంతో ఆమె వెంటనే స్పందించి సరే అని ఒప్పేసుకుంది. ఇక్కడితో అయిపోలేదు.. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.
Read More : ప్రోమోల్లో క్రియేటివిటీ.. షోలో కనిపించడం లేదా?
పర్సు మర్చిపోయానని చెప్పిన వ్యక్తి ఆ మహిళకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఆమె తీసుకున్న వస్తువులకు తానే బిల్లు కడతానని చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఈ సంఘటన అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోజరిగింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోలో వారి సంభాషణ ఈ విధంగా ఉంది. ఆ అపరిచిత వ్యక్తి ఆమెతో మాట్లాడుతూ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మీరు తీసుకున్న ఈ సరుకులన్ని మీకు ఉచితంగా ఇస్తున్నాను. మీకు కావాల్సిన సరుకులన్నింటిని మేమే కొని మీకు ఇస్తున్నాం. ఎందుకంటే మీరు చాలా మంచివారు.
Read More : అల్లిపూల వెన్నెల… బతుకమ్మ పాట
ఆకలి అని అడగగానే వెనుక ముందు ఆలోచించకుండా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. సాటి మనుషుల పట్ల జాలి, దయ కలిగి ఉన్నారు. నేను ఎవరో తెలియకపోయినా నేను చెప్పేది నిజమో అబద్ధమో కూడా ఆలోచించకుండా నా ఆకలి తీర్చడానికి అంగీకరించారు. మీ మంచి మనసుకు ఈ చిన్న బహుమతి అన్నాడు. ఇక అతడి మాటలు విని సదరు మహిళ షాక్ కి గురైంది. మనం మంచి చేస్తే మనకు మంచే జరుగుతుందని ఆనందంతో కన్నీరు పెట్టింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు మహిళను మెచ్చుకుంటున్నారు.
My allergies are acting up ? pic.twitter.com/3hoMuXg63o
— chris evans (@chris_notcapn) October 4, 2021
