ఆస్తి రాసిచ్చింది : వెరైటీగా పెళ్లి ప్రపోజ్ చేసిన అమ్మాయి

చైనాలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ అమ్మాయి చేసిన పెళ్లి ప్రపోజ్.. అందరిని అట్రాక్ట్ చేసింది. ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేసిందంటే.. తన బాయ్ ఫ్రెండ్

  • Publish Date - December 22, 2019 / 01:40 PM IST

చైనాలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ అమ్మాయి చేసిన పెళ్లి ప్రపోజ్.. అందరిని అట్రాక్ట్ చేసింది. ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేసిందంటే.. తన బాయ్ ఫ్రెండ్

చైనాలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ అమ్మాయి చేసిన పెళ్లి ప్రపోజ్.. అందరిని అట్రాక్ట్ చేసింది. ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేసిందంటే.. తన బాయ్ ఫ్రెండ్ కు చాలా వెరైటీగా మ్యారేజ్ ప్రపోజ్ చేసింది. తన ఆస్తి పత్రాలు, ఓ బీఎండబ్ల్యూ కారు కీస్.. ఫ్లవర్ బొకేలో ఉంచి.. బాయ్ ఫ్రెండ్ ను ప్రపోజ్ చేసింది. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. ఊహించని ఈ ఘటనతో ఆ అబ్బాయి విస్తుపోయాడు.

అమ్మాయి పేరు జిన్. వయసు 24 ఏళ్లు. జియావో కీ అనే అబ్బాయితో ప్రేమలో పడింది. కొంత కాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇరు కుటుంబాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే.. జిన్ తన బాయ్ ఫ్రెండ్ కి సర్ ప్రైజ్ ఇచ్చింది. ఫస్ట్ టైమ్ ఇద్దరూ ఎక్కడైతే కలుసుకున్నారో.. ఆ వేదికలోనే మ్యారేజ్ ప్రపోజ్ చేసింది. హెనాన్ లోని ఎగ్జిబిషన్ హాల్ లో ఇద్దరూ పరిచయం అయ్యారు. అక్కడే మ్యారేజ్ ప్రపోజ్ చేసింది జిన్.

తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక డెకరేషన్ చేసిన జిన్.. పెళ్లి కూతురిలా తయారైంది. ఓ ఫ్లవర్ బొకేని సిద్ధం చేసింది. అందులో ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్, బీఎండబ్ల్యూ కారు కీ ఉంచింది. నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ.. ఆ ఫ్లవర్ బొకేని ప్రియుడి చేతికిచ్చి అడిగింది. ఊహించని విధంగా జిన్ ప్రపోజ్ చేయడంతో ముందు అబ్బాయి సర్ ప్రైజ్ అయ్యాడు. కాసేపటికి తేరుకుని.. మ్యారేజ్ ప్రపోజ్ ని యాక్సెప్ట్ చేశాడు.

తన బాయ్ ఫ్రెండ్ అంటే తనకు చాలా ఇష్టమని అమ్మాయి చెప్పింది. అతడి కోసం ఏదన్నా వెరైటీగా చేయాలని అనుకున్నానని.. అందుకే ఇలా చేశానని వివరించింది. తన బాయ్ ఫ్రెండ్ తన గురించి చాలా కేర్ తీసుకుంటాడని, అతడంటే చాలా ప్రేమ అని చెప్పింది.