China
China : భూమి మీద నూకలు ఉంటే ఎంత భయంకరమైన ప్రమాదం నుంచి అయినా తప్పించుకోగలుగుతారు. ఓ మహిళ రోలింగ్ మెషీన్లో చిక్కుకుంది. యంత్రంలో అనేకసార్లు తిరిగినా ఆమెకు ఏమీ జరగకపోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
కొన్ని పరిశ్రమల్లో యంత్రాల దగ్గర పనిచేసే వారు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వాటిలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. చైనాలో జరిగినట్లుగా చెబుతున్న ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. ఓ మహిళ రోలింగ్ మెషీన్లో పడిపోయింది. ఈ మెషీన్లు బట్టల పరిశ్రమ లేదా షీట్ మెటల్ తయారు చేసేటపుడు ఉపయోగిస్టారట. అందులో పడిన మహిళ ఇరుక్కుపోయి అనేకసార్లు తిరుగుతూ కనిపించింది. ప్రమాదాన్ని గుర్తించిన కొందరు వెంటనే మెషీన్ ఆపివేయడంతో అదృష్టవశాత్తూ ఆమె తీవ్ర గాయాలు కాకుండా ప్రాణాలతో బయటపడింది.
ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయిన తరువాత దానిని తొలగించారు. ‘ప్రమాదకరమైన పరిస్థితి నుంచి మహిళ తప్పించుకోగలిగింది’ అని .. ‘చూస్తుంటే చాలా భయం వేసింది..కానీ అదృష్టవశాత్తూ ఇంజిన్ ఆగిపోయింది’ అంటూ కామెంట్లు చేసారు.