Taliban
Woman Journalist: మహిళలు ఇంటికే పరిమితం కావాలనే అఫ్ఘానిస్తాన్‌లోని తాలిబన్ల సిద్ధాంతం ఉల్లఘించి, ఓ తాలిబన్ లీడర్‌నే లైవ్ టీవీ చానెల్‌లో ఇంటర్వ్యూ చేసింది ఓ మహిళ. ఆమెనే 24ఏళ్ల బెహేష్ట అర్ఘంద్. ఇప్పుడామె దేశం విడిచి వెళ్లిపోగా.. ఈ నెల 15న తాలిబన్లు మళ్లీ దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న రెండు రోజుల తర్వాత అంటే ఆగస్ట్ 17న ఓ తాలిబన్ సీనియర్ నేతను బెహెస్తా ఇంటర్వ్యూ చేసింది. తాలిబాన్లు అఫ్ఘానిస్తాన్‌లో చేస్తున్న విద్వంసాలపై ఆమె ప్రశ్నలు సంధించింది.
అఫ్ఘానీ న్యూస్ నెట్‌వర్క్‌లో ఆ తాలిబన్‌ను ఇంటర్వ్యూ చేసిన తొలి మహిళా జర్నలిస్ట్‌గా ఆమె చరిత్ర సృష్టించగా.. ఆమె రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. అయితే, చివరకు తాలిబన్ల భయంతో ఆమె అఫ్ఘానిస్థాన్‌ను వీడిచి పెట్టేసింది. అఫ్ఘానిస్తాన్ వార్తా ఛానల్ టోలో న్యూస్ యాంకర్ బెహేష్ట అర్ఘంద్ దేశం విడిచి వెళ్లిపోయారు. తాలిబాన్ నాయకుడిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత బెహెష్ట చర్చలోకి రాగా.. తాలిబాన్ నాయకుడు మహిళా యాంకర్ ముందు కూర్చుని ఆమె ప్రశ్నలకు సమాధానమివ్వడం జరిగింది.
కొన్ని రోజుల క్రితం, బెహేష్టా మలాలా యూసఫ్‌జాయ్‌ని కూడా ఇంటర్వ్యూ చేసింది. అఫ్ఘాన్ ఛానెల్‌లో మలాలాకు మొదటి ఇంటర్వ్యూ ఇదే. బెహేష్ట అర్ఘండ్ తాలిబాన్ మీడియా బృందంలోని సన్నిహితుడైన మౌలావి అబ్దుల్‌హాక్ హేమద్‌ని కాబూల్ పరిస్థితి, తాలిబన్ల ఆక్రమణ గురించి ఇంటర్వ్యూ చేశారు. బెహెష్ట 24ఏళ్లకే కెరీర్‌లో అత్యున్నత స్థాయిలో నిలవగా.. ఆమె 9వ తరగతిలో ఉన్నప్పుడే, జర్నలిస్ట్ కావాలని నిర్ణయించుకుంది. కానీ తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తరువాత, తన వృత్తిని వదిలేసి వేరే దేశం వెళ్లిపోయింది. తాలిబన్ల భయంతోనే దేశం విడిచి వెళ్లిపోయినట్లు ఆమె చెప్పారు.
NIMA WORAZ: #Kabul Situation Discussed [Pashto]
In this program, host Beheshta Arghand interviews Mawlawi Abdulhaq Hemad, a close member of the Taliban’s media team, about Kabul’s situation and house-to-house searches in the city. https://t.co/P11zbvxGQC pic.twitter.com/Pk95F54xGr
— TOLOnews (@TOLOnews) August 17, 2021