Viral Video : కొబ్బరి కాయ ఎంత పనిచేసింది.. బైక్‌పై వెళ్లే మహిళ తలపై పడింది.. అంతే.. షాకింగ్ వీడియో!

సాధారణంగా కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతుంటాయి. ఆకస్మాత్తుగా జరిగే సంఘటనలు కొన్ని నవ్వు తెప్పించేలా ఉంటాయి.

Viral Video : సాధారణంగా కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతుంటాయి. ఆకస్మాత్తుగా జరిగే సంఘటనలు కొన్ని నవ్వు తెప్పించేలా ఉంటాయి. మరికొన్ని బాధకరమైనవి ఉంటాయి. బైకులపై స్టంట్ చేస్తున్న సమయంలో పట్టుతప్పి కిందపడిపోవడం లేదా కాలు జారిపడటం వంటి అనేక సంఘటనలు చూస్తూనే ఉంటాం. అలాంటి ఘటనే ఒకటి మలేసియాలో జరిగింది.

బైకుపై రయ్యమని వెళ్తోంది ఓ మహిళ. అంతలో రోడ్డు పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు నుంచి ఓ కొబ్బరి కాయ రోడ్డుపై పడింది. సరిగ్గా అదే సమయంలో బైకు రావడంతో ఆ కొబ్బరికాయ కాస్తా వెనుక కూర్చొన్న మహిళ తలపై పడింది. అంతే.. వెంటనే బైకుపై నుంచి మహిళ కింద పడిపోయింది. మలేసియాలో జరిగిన ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో ఇద్దరు వ్యక్తులతో హైవేపై వేగంగా బైక్‌ దూసుకెళ్తోంది. హైవేకి ఆనుకుని ఉన్న కొబ్బరి చెట్టు నుంచి భారీ కొబ్బరి కాయ పడింది. బైక్‌పై నడుపుతున్న మహిళపై కొబ్బరికాయ పడిపోవడంతో ఆమె వేగంగా వెళ్తున్న బైక్‌పై నుంచి కిందపడింది. ఆమె హెల్మెట్ కూడా ఎగిరిపోయింది. ఈ ఘటన వీడియోను మలేసియా మంత్రి అజ్రుల్ మహతీర్ బిన్ అజీజ్ షేర్ చేశారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా హైవే వెంబడి ఉన్న కొబ్బరి చెట్లను తొలగించాలని వినతిపత్రం ఇచ్చారు.

బాధిత మహిళ కుమార్తె కూడా తన తల్లి పరిస్థితి గురించి వివరిస్తూ ఫేస్‌బుక్‌లో వీడియోను షేర్ చేసింది. దేవుడి దయవల్ల మా అమ్మకు ప్రాణపాయం తప్పింది. ఇప్పటికీ GH పెనాంగ్ వార్డులో ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. బాధితురాలి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. (కుడి భుజం, ఎడమ చేయి ఫ్రాక్చర్, 2 పక్కటెముకలు) స్వల్పంగా దెబ్బతగిలిందని ఆమె చెప్పుకొచ్చింది.

Read Also : Kolkata Student : జేయూ విద్యార్థికి 3 జాబ్ ఆఫర్లు.. గూగుల్, అమెజాన్ వద్దన్నాడు.. ఫేస్‌బుక్‌లో భారీ ప్యాకేజీ కొట్టేశాడు!

ట్రెండింగ్ వార్తలు