Garlic In Her Nose
Garlic In Her Nose: వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రధానంగా వాన, చలికాలంలో వచ్చే జలుబు, ముక్కు దిబ్బడలకు మంచి ఔషధంగా పని చేస్తుంటుంది. తరచుగా జలుబు, ముక్కు దిబ్బడంతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఏవో ఏవో మందులు వాడుతుంటారు. సైనస్ ఉండే వారి సమస్య చెప్పనవసరం లేదు. ముక్కు దిబ్బడతో గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. ఈ సమస్యతో బాధ పడుతున్న ఓ యువతి..చేసిన ప్రయత్నం నెట్టింట వైరల్ గా మారింది.
అమెరికాలోని Arizona ప్రాంతంలో ఉండే Rozaline యువతి…ముక్కు రంధ్రాల్లో పొట్టు తీసిన రెండు వెల్లిపాయలను పెట్టుకుంది. అనంతరం 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉండిపోయింది. తర్వాత ముక్కులో నుంచి రెండు వెల్లుల్లిపాయలను తీసేసింది. తర్వాత..ముక్కులో ఉన్న శ్లేష్మం కరిగిబయటకు రావడం వీడియోలో కనిపించింది. దీనివల్ల తనకు ఎలాంటి ఇబ్బంది కలుగ లేదని, వెల్లుల్లి తీసిన తర్వాత..ముక్కులో నుంచి నీరు వచ్చిందని ఆ యువతి వెల్లడించారు. తన సైనస్ బయటకు పోయిందని తాను అనుకుంటున్నట్లు తెలిపారు.
దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనికి లక్షలాది వ్యూస్ వచ్చాయి. కొంతమంది ఆసక్తిగా ఉండగా..మరికొంతమంది అసహ్యించుకుంటున్నారు.