Covid-19: యూకేలో అతిపెద్ద కరోనావైరస్ టెస్టింగ్ ఫెసిలిటీ కొవిడ్-19 అవుట్ బ్రేక్ రికార్డ్ బ్రేక్ చేసినట్లు ఉంది. స్కై న్యూస్ కథనం ప్రకారం.. క్రిస్టమస్ రోజున టెస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. మిల్టన్ కీన్స్ లైట్ హౌజ్ ల్యాబొరేటరీలో స్టాఫ్ రోజులోదాదాపు 70వేల టెస్టులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ల్యాబ్ లో ఉండే ముగ్గురు చొప్పున ఉండే నాలుగు సైంటిఫిక్ బృందాలకు సైతం ఇన్ఫెక్షన్ సోకింది.
ఇప్పటివరకూ వైరస్ బారిన ఎంతమంది గురయ్యారనే దానిపై క్లారిటీ లేదు. వర్క్ ప్లేస్ లో కొవిడ్ నుంచి సెక్యూర్ గా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు కన్ఫామ్ చేసుకునేందుకు ఎన్‌హెచ్ఎస్ టెస్ట్, ట్రేస్ లు కొనసాగిస్తున్నారు. లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరినీ టెస్టులకు చేయించుకోవాల్సిందిగా సూచిస్తున్నాయి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ కేర్ స్టేట్‌మెంట్లో వెల్లడించింది.
క్రిస్టమస్ ఒక్క రోజే.. 4లక్షల 50వేల టెస్టులు నిర్వహించారు. హై డిమాండ్ ఉన్న ప్రాంతాలపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. కొత్త వైరస్ ను కన్ఫామ్ చేసుకునే క్రమంలో రోజుకు దాదాపు 70వేల టెస్టులు జరుగుతున్నాయి. ప్రస్తుతం 50వేల టెస్టులు జరుగుతుండగా అంతకుమించి పేషెంట్లు టెస్టింగ్ సెంటర్ల దగ్గర నిరీక్షిస్తున్నారు.