రోడ్డుపై పడ్డ ఓ గుంత అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముందుగా అందరూ ఆ గుంతను చూసి సింక్ హోల్ అనుకున్నారు. వెంటనే అక్కడి పోలీసులు, ఎఫ్ బీఐ అధికారులు రోడ్డు కార్మికులను పిలిపించి మరమ్మత్తులు చేపట్టారు.
రోడ్డుపై పడిన ఓ గుంత అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముందుగా అందరూ ఆ గుంతను చూసి సింక్ హోల్ అనుకున్నారు. పోలీసులు, FBI అధికారులు కార్మికులను పిలిపించి మరమ్మత్తులు చేపట్టారు. సింక్ హోల్ వెనక అసలు రహస్యం తెలిసి అధికారులంతా షాకయ్యారు. ఎందుకంటే.. అది సింక్ హోల్ కాదు. సొరంగ మార్గం. అంతేకాదు.. హోల్ కాస్త నేరుగా దగ్గరలోని బ్యాంకు వరకు ఉన్నట్టు గుర్తించారు. ఇదంతా దొంగల పనే అని.. బ్యాంకులో దొంగతనానికి సొరంగ మార్గం ద్వారా స్కెచ్ వేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఫ్లోరిడాలోని పెమ్ బ్రోక్ పైన్స్ లోని ఛేజ్ బ్యాంకు సమీపంలో జరిగింది.
50 గజాల వరకు ఈ సొరంగం ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఎంతో చిన్నదైన ఈ మార్గంలో కేవలం ఒక మనిషి మాత్రమే వెళ్లేందుకు వీలుంది. పొట్టపై పాకుతూ లోపలికి వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ఇలాంటి సొరంగాలను సినిమాల్లోనే చూసి ఉంటామని, ప్రత్యక్షంగా ఇప్పడు ఇలా చూస్తున్నామని ఎఫ్ బీఐ ఏజెంట్ మైక్ లెవరాక్ మీడియాకు తెలిపారు. ఈ సొరంగానికి సంబంధించిన ఫొటోలను ఎఫ్ బీఐ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతున్నాయి.
Attempted bank burglary. 50 yard tunnel leads to Chase Bank branch at 390 S. Flamingo Road, Pembroke Pines, FL. Call FBI with information 754.703.2000. pic.twitter.com/nK0rZi8QTO
— FBI Miami (@FBIMiamiFL) January 30, 2019