వరల్డ్ బ్యాంక్ శుక్రవారం 400 మిలియన్ అమెరికన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ఒప్పుకుంది. ఇది ఇండియాకు కాదు. అఫ్ఘనిస్తాన్ కు మాత్రమే. ఎకానమీతో పాటు పబ్లిక్ ఫైనాన్స్ తిరిగి కోలుకునేందుకు సపోర్ట్ ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. Covid-19 కారణంగా దేశంలో నెలకొన్న పరిస్థితుల నుంచి బయటపడాలని ఈ నిర్ణయం తీసుకుంది.
ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ నుంచి 160మిలియన్ అమెరికన్ డాలర్లను ఇన్సెంటివ్ ప్రోగ్రాం డెవలప్‌మెంట్ పాలసీ గ్రాంట్ కాంప్రైజెస్ అప్రూవ్ చేసింది. వరల్డ్ బ్యాంక్ గ్రూప్స్ పేద దేశమైన అఫ్ఘనిస్తాన్‌కు 240 అమెరికన్ డాలర్ల ఫండింగ్ ఇచ్చింది. దీని కోసం 34 మంది దాతలను సమకూర్చింది వరల్డ్ బ్యాంక్.
ఈ రోజు బోర్డ్ అప్రూవల్ తెలిపిన నిర్ణయమే స్పష్టం చేస్తుంది. వరల్డ్ బ్యాంక్ అఫ్ఘనిస్తాన్ కోలుకునేందుకు సాయాన్ని రెట్టింపు చేస్తుందని. అని వరల్డ్ బ్యాంక్ అఫ్ఘనిస్తాన్ దేశ డైరక్టర్ అన్నారు. ఈ సాయం అఫ్ఘనిస్తాన్ తిరిగి తమ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగించేందుకు ఉపయోగపడుతుందని, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే కరోనావైరస్ లాంటి మహమ్మారి నుంచి బయటపడొచ్చని తెలిపారు.
అఫ్ఘనిస్తాన్ లో గురువారం 171 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 3వేల 563కేసులు ఫైల్ అయ్యాయి.