World Food Safety Day: తిండి లేక కొందరు.. వృథా చేస్తూ మరికొందరు

World Food Safety Day: వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే (డబ్ల్యూఎఫ్ఎస్‌డీ) 2021 జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆహారం పట్ల శ్రద్ధ, వృథా కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహార లోపంతో వచ్చే రిస్కులు తెలుసుకోవాలి. దైనందిన జీవితంలో ఎదుర్కొనే ఫుడ్ సెక్యూరిటీ, మానవ ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సు, వ్యవసాయం, మార్కెట్ లావాదేవీలు, టూరిజం డెవలప్మెంట్ అన్ని అంశాలు ఆహారంపైనే ఆధారపడి ఉంటాయి.

ఈ ఏడాది వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా రేపటి ఆరోగ్యకరమైన ఉదయం కోసం ఇవాళ ఫుడ్ సేఫ్ చేయండి (సేఫ్ ఫుడ్ టుడే ఫర్ ఏ హెల్తీ టుమారో) అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇలా చేయడం వల్ల ఉత్పత్తిలోనే కాకుండా ఫుడ్ సేఫ్ చేయడంలోనూ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉండి భౌగోళికంగా, ఆర్థికంగా వృద్ధి కావొచ్చు.

ప్రజలు, జంతువులు, మొక్కలు, పరిసరాలు మన భవిష్యత్ పై ప్రభావం చూపించే సంబంధాలే. పోషకాహార లోపం వల్ల ఐదేళ్ల లోపు పిల్లలతో పాటు అన్ని వయస్సుల వారిపై దుష్ప్రభవాలు చూపిస్తున్నాయి. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 2018నుంచి జూన్ 7న వరల్డ్ సేఫ్టీ డే నిర్వహిస్తున్నారు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ కలిసి వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేను సంయుక్తంగా నిర్వహిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు