World Record: అరటి పండ్లు వరుసగా పేర్చి గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించారు.!

అమెరికాలోని షికాగోకు చెందిన జ్యూవెల్ - ఓస్కో సూపర్ మార్కెట్ స్టోర్ నిర్వాహకులు సరికొత్త రికార్డును సృష్టించారు. వెస్ట్‌మాంట్ గ్రామంలో బనానా బొనాంజా పేరుతో నిర్వహించిన ప్రదర్శనలో సుమారు 31,751 కిలోలు(70,000 పౌండ్ల) అరటిపండ్లను ఉపయోగించి గిన్నీస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కారు.

World Record: అమెరికాలోని షికాగోకు చెందిన జ్యూవెల్ – ఓస్కో సూపర్ మార్కెట్ స్టోర్ నిర్వాహకులు సరికొత్త రికార్డును సృష్టించారు. వెస్ట్‌మాంట్ గ్రామంలో బనానా బొనాంజా పేరుతో నిర్వహించిన ప్రదర్శనలో సుమారు 31,751 కిలోలు(70,000 పౌండ్ల) అరటిపండ్లను ఉపయోగించి గిన్నీస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కారు. పండ్ల ఉత్పత్తిదారు ఫ్రెష్ డెల్ మోంటే, సూపర్ మార్కెట్ చైన్ జ్యువెల్-ఓస్కో ఈ ఘనతను సాధించారు. గిన్నిస్ టైటిల్‌ను పొందే ప్రయత్నంలో జ్యువెల్-ఓస్కో యొక్క స్టోర్ లలో ఒకదాని బయట పెద్ద అరటి పండ్ల స్టాండ్ ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. దీనిలో సుమారు మూడు లక్షల అరటిపండ్లను ఒకదాని పక్కన మరొకటి పేర్చారు. ఇందుకోసం మూడు రోజులు కష్టపడ్డారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కు చెందిన అధికారులు ఈ ప్రదర్శనను తిలకించి ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ప్రదర్శనగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ల్లోకి ఎక్కించారు. ఇందుకు సంబంధించి అధికారిక దృవపత్రాన్ని నిర్వాహకులకు అందజేశారు. అరటి పండ్ల ప్రదర్శన చిత్రాలు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్‌ను వెస్ట్‌మాంట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టూరిజం బ్యూరో వారు అధికారిక ఫేస్‌బుక్ పేజీ ద్వారా విడుదల చేశారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఉన్న అరటిపండ్లను ప్రదర్శనను తిలకించేందుకు వచ్చిన వారికి అందజేశారు. మిగిలిన అరటి పండ్లను చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు అందజేశారు. అయితే 2016 జూలైలో అతిపెద్ద పండ్ల ప్రదర్శన గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులో నమోదైంది. దీనిని బ్రెజిలియన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైవ్‌స్టాక్ నిర్వహించింది. వారు పైనాపిల్, కొబ్బరి, ఆరెంజ్, యాపిల్, స్ట్రాబెర్రీ, ప్యాషన్ ఫ్రూట్ వంటి 19రకాల పండ్లను ప్రదర్శించారు. పండ్ల మొత్తం బరువు 18,805.84 కిలోలు. తాజాగా ఈ రికార్డును సూపర్ మార్కెట్ చైన్ జ్యువెల్-ఓస్కోలు సొంతం చేసుకున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు