మున్ముందు కరోనా తీవ్రత అధికం….చాలా భయంకరమైనదని హెచ్చరించిన WHO చీఫ్

కరోనా వైరస్ యొక్క అధిక తీవ్రత ఇంకా రాలేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)డైరక్టర్ జనరల్ టెడ్రస్ ఆడానమ్ గేబ్రియసస్ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వేలమంది ప్రాణాలు బలితీసుకున్న కరోనా మహమ్మారి  యొక్క అత్యంత తీవ్రత ముందు ముందు ఇంకా ఉండనుందని ఆయన తెలిపారు. కరోనా తీవ్రత మనందరి ముందు ఇంకా ఉందని,తమను నమ్మాలని మీడియా సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు.

అందరం కలిసి ఈ విషాదాన్ని నివారిద్దామని ఆయన అన్నారు. ఇప్పటికీ చాలామందికి ఈ వైరస్ గురించి అర్థంకాలేదని ఆయన తెలిపారు. WHOలో ఎలాంటి రహస్యం లేదని అన్నారు. ఎంటుకంటే విషయాలను రహస్యంగా ఉంచడం అనేది పెద్ద డేంజర్ అని ఆయన అన్నారు. ఇదొక ఆరోగ్య సమస్య అని టెడ్రస్ తెలిపారు. కరోనా వైరస్ చాలా ప్రమాదకరమైనదన్నారు. మనకు తేడాలు ఉన్నప్పుడు ఇది మన మధ్య పగుళ్లను పూర్తిగా ఉపయోగించుకుంటుందని తెలిపారు.

యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) సిబ్బంది తన ఏజెన్సీతో కలిసి పనిచేయడానికి ఆమోదించబడ్డారని,డబ్యూహెచ్ వో పారదర్శకతకు అదొక సంకేతమని టెడ్రస్ చెప్పారు. సీడీసీ సిబ్బందిని కలిగి ఉండటం….మొదటిరోజు నుంచి తమ నుంచి ఏమీ దాచి ఉండలేదన్న అర్థం అని టెడ్రస్ తెలిపారు.

1918లో ప్రపంచవ్యాప్తంగా 10కోట్లమంది ప్రాణాలు బలితీసుకున్న స్పానిష్ ఫ్లూ మాదిరిగా కరోనా వైరస్ కూడా చాలా డేంజరస్ కాంబినేషన్ అని ఆయన అన్నారు. కరోనా వైరస్ ను నెం.1ప్రజల శత్రువుగా ఆయన అభివర్ణించారు. తాము మొదటిరోజు నుంచి హెచ్చరిస్తున్నామని, కరోనా వైరస్ ఒక డెవిల్ అని, అందరూ ఫైట్ చేయాల్సిన అవసరముందన్నారు.

జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ తెలిపిన వివరాల ప్రకారం…మంగళవారం ఉదయం నాటికి ప్రపంచవ్యాప్తంగా 1లక్షా 70వేల 324 కరోనా మరణాలు నమోదయ్యాయి. కరోనా కేసులు 24లక్షల 77వేల 426కి చేరుకున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు,మరణాలు అమెరికాలోనే నమోదయ్యాయి. 

ట్రెండింగ్ వార్తలు