Cool Drink : ప్రాణం తీసిన కూల్ డ్రింక్

చైనాకు చెందిన 22ఏళ్ల యువకుడు గత నెలలో ఎండ వేడిని తట్టుకోలేక ఒకేసారి 1.5 లీటర్ల కోకాకోలా తాగాడు. తాగిన కొద్దీ సేపటికే కడుపునొప్పి తలతిరగడం వంటి సమస్యలు వచ్చాయి.

Cool Drink

Cool Drink : ఎండవేడిమి తట్టుకోలేక పది నిమిషాల్లో ఒకటిన్నర లీటర్ కూల్ డ్రింక్ తాగాడు.. అనంతరం అనారోగ్యానికి గురై ప్రాణాలు విడిచారు. వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన 22ఏళ్ల యువకుడు గత నెలలో ఎండ వేడిని తట్టుకోలేక ఒకేసారి 1.5 లీటర్ల కోకాకోలా తాగాడు. తాగిన కొద్దీ సేపటికే కడుపునొప్పి తలతిరగడం వంటి సమస్యలు వచ్చాయి. ఆరు గంటల్లోనే ఆరోగ్యపరిస్థితి విషమించింది. దీంతో అతడిని బీజింగ్‌లోని చావోయాంగ్‌ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స అందిస్తుండగా రక్తపోటు వచ్చి ప్రాణాలు విడిచాడు.

చదవండి : Cool drink in commode : కమ్మోడ్‌లో కూల్ డ్రింక్ తయారు చేసి..పార్టీలో గెస్ట్ లకు ఇచ్చిన యువతి..ఈ పంచ్ కిక్ ఇచ్చిందా? అంటూ పరాచికాలు

అయితే శీతల పానీయాలు ఒకేసారి అధికమొత్తంలో సేవించడం వలన న్యుమాటోసిస్ సమస్య తలెత్తుతుంది. దీనికారణంగా కడుపులో గ్యాస్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇతడి విషయంలో కూడా అదే జరిగింది.. గ్యాస్ అధికమై గుండెకు రక్తప్రసరణ తగ్గింది.. దీంతో లివర్ షాక్ కు గురయ్యాడు. ఫలితంగా యితడు మరణించాడు. యువకుడిని బ్రతికించేందుకు వైద్యులు 18 గంటలు శ్రమించారు అయినా ఫలితం దక్కలేదు.

చదవండి : Cool Drinks : కూల్ డ్రింక్స్ తాగుతున్నారా!..అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?..

శీతల పానీయాలు తాగేసమయంలో జాగ్రత్త వహించాలని వైద్యులు చెబుతున్నారు. కడుపులో అదుపుచేయలేనంత గ్యాస్ ఉత్పత్తి అయితే క్రమంగా శరీరంలోని కొన్ని అవయవాలకు రక్తప్రసరణ కావాల్సినంతగా జరగదు. దీంతో అనేక సమస్యలు వచ్చి మృతి చెందే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఒకేసారి అధికమొత్తంలో శీతల పానీయాలు తాగడంవలన గుండెపై అధిక ఒత్తిడి పడుతుందని వైద్యులు పేర్కొన్నారు.