24 Year Woman..22 Children : ఆమె వయస్సు 24..పిల్లలు 22 మంది..దత్తత పిల్లలు కాదు..!!

24 ఏళ్లకే ఆమె 22 మంది పిల్లలకు తల్లి అయ్యింది. అయినా ఆమెకు ఆ 22మంది పిల్లలు సరిపోరట..ఏకంగా 100మంది పిల్లలు కావాలని ఉంది అని చెబుతోంది.

24 Year Old Woman Who Has 22 Children Reveals She Wants Even More

24 year old woman who has 22 children  : 24 ఏళ్లకే ఆమె 22 మంది పిల్లలకు తల్లి అయ్యింది. అయినా ఆమెకు ఆ 22మంది పిల్లలు సరిపోరట..ఏకంగా 100మంది పిల్లలు కావాలని ఉంది అని చెబుతోంది. ఏంటీ 24 ఏళ్లకే 22మంది పిల్లలు ఉండటమేంటీ? దత్తత తీసుకుని ఉంటుందేమో అనుకోవచ్చు.. కానీ అదేమీ కాదు. ఆ యంగెస్ట్ తల్లి పేరు క్రిష్టినా ఓజ్‌టుర్క్..ఆమె భర్త పేరు గాలిప్. అతని వయస్సు 57.

రష్యాకు చెందిన క్రిస్టినా 24 ఏళ్లు. కానీ 22మంది పిల్లలకు తల్లి అయ్యిది. వారి ఆలనా పాలనా అంతా ఆమే చూసుకుంటోంది. పైగా పిల్లలందరికీ రెండేండ్ల కన్నా తక్కువ వయసే ఉంది. ఇదెలా సాధ్యపడిందా? అని ఆశ్చర్యపోతున్నారా..? సరోగసీ ప్రక్రియ ద్వారా ఈ జంట ఈ పిల్లలకు జన్మనిచ్చింది. వీరందరినీ తానే స్వయంగా చూసుకుంటానని, అందరు తల్లుల్లాగనే తానూ వారికి అన్ని పనులు చేస్తానని క్రిస్టినా చెబుతోంది. తనకు ఈ పిల్లలు సరిపోరని.. 100 మంది దాకా పిల్లలు కావాలనే కోరిక ఉందని నవ్వుతూ చెబుతోంది.

జార్జియా టూర్ వెళ్లినప్పుడు క్రిస్టినా గాలిప్ ను కలిసింది. అలా వారిద్దరు ఒకటయ్యారు. ఇప్పుడు జార్జియాలోని బటుమీలో నివసిస్తున్నారు. క్రిస్టినా పిల్లలను సరోగసి ద్వారా పొందటానికి సుమారు £138,000 (AU $258,000) చెల్లించింది. తన పిల్లలతో తనకు అసలు సమయమే తెలియటంలేదని..రోజుకు 24 గంటలు సరిపోవటంలేదని తెగ ఆనందపడిపోతు తెలిపింది క్రిస్టినా. సరోగేట్‌ల ద్వారా పిల్లలను కనడం ద్వారా తాను ఏదీ కోల్పోయినట్లు అనిపించడం లేదని..కేవలం శారీరకంగా కలిసి పిల్లల్ని కంటేనే పిల్లలుకాదని..ఇలా సరోగసి ద్వారా పిల్లల్ని పొందినా వారిపై అంత ప్రేమ ఉంటుందని స్పష్టంచేసింది క్రిస్టినా.

ప్రపంచంలో అతి పెద్ద కుటుంబం మాదే అవుతుందేమో..తెలియదు గానీ..ప్రపంచంలోనే సంతోషకరమైన కుటుంబంగా ఉండాలనుకుంటున్నానని తెలిపింది క్రిస్టినా.నాలాగానే నా భర్త కూడా ఎక్కువమంది పిల్లలు కావాలని కోరుకున్నాడని..అందుకే ఇంతమంది పిల్లలను పొందాం అని తెలిపింది. మా మధ్య శారీరక సంబంధం మారిపోయింది. దీంతో పిల్లల కోసం సరోగసి ద్వారా పొందాలని అలాగని ఒకరు ఇద్దరు కాదు..ఎక్కువమంది పిల్లలు కావాలని ఇద్దరమూ కోరుకున్నాం. అందుకే ఇలా ఇంతమంది పిల్లలకు మేం అమ్మానాన్నం అయ్యాం అని తెలిపింది.

కాగా క్రిస్టినా తన 17 ఏళ్ల వయస్సులో మొదటిబిడ్డకు సహజంగానే జన్మనిచ్చింది. కానీ తరువాత వారి దాంపత్య బంధంలో వచ్చిన మార్పులతో సరోగసి ద్వారా 22మంది పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. గాలిప్ క్రిస్టినాలు తమకు ఎక్కువ మంది పిల్లల్ని కనాలను అనుకున్నారు. అలా ప్రతీ సంవత్సరం ఒక బిడ్డకు జన్మనివ్వాలనుకున్నారు. అలా క్రిస్టినా తన 17 ఏళ్ల వయస్సులో సహజంగానే బిడ్డను జన్మనిచ్చింది. ఆ తరువాత సరోగసి ద్వారా 22మంది పిల్లలకు జన్మనిచ్చింది. క్రిస్టినా తన ఇన్ స్టాలో తన  పిల్లలతో కలిసి ఉన్నఫోటోలను షేర్ చేసింది.