jos-buttler:IPL 2020లో ఆల్మోస్ట్ సగం మ్యాచ్‌లు అయిపోయాయి. ఇప్పటికే దాదాపుగా ఏ ఏ జట్లు ప్లే ఆఫ్‌లకు వెళ్లబోతున్నాయో ఒక అంచానా కూడా వచ్చేసింది. అయితే ఒక స్పెల్ మ్యాచ్‌లు అయిపోయాక.. జట్లలో మార్పులు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే కోల్‌కత్తా కెప్టెన్సీ బాధ్యతల నుంచి టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌ను తప్పించి కొత్త సారథిగా ఇంగ్లండ్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను నియమించారు.
Thankful for a boss like Jos. ?#HallaBol | #RoyalsFamily | #BossDay | @josbuttler pic.twitter.com/ZFUZnoyQNH
— Rajasthan Royals (@rajasthanroyals) October 16, 2020
ఈ నిర్ణయం బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్మిత్ కూడా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లుగా వార్తలు క్రికెట్ సర్కిళ్లలో.. సోషల్ మీడియాలో గట్టిగా వ్యాపించాయి. అయితే అందుకు కారణం కూడా లేకపోలేదు. ఈ రూమర్‌కి కారణం రాజస్థాన్ రాయల్స్ ప్రాంఛైజ్ ట్విట్టర్ హ్యాండిల్.. అందులో వరల్డ్ బెస్ట్ బాస్ అని రాసి ఉన్నకాఫీ కప్‌ను పట్టుకున్న బట్లర్ ఫొటోను పంచుకోవడమే. ‘జోస్ వంటి బాస్‌కి థ్యాంక్స్’ అనే క్యాప్షన్‌ను కూడా రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ హ్యాండిల్‌లో పెట్టారు. దాంతో రాజస్థాన్ తదుపరి కెప్టెన్ జోస్ బట్లరే అనే సంకేతాలను ఇచ్చిందని అభిమానులు కామెంట్ చేయగా.. ఇదే వార్తగా మారి వైరల్ అయ్యింది.
©️aptain. ?#HallaBol | #RoyalsFamily | #IPL2020 | @stevesmith49 pic.twitter.com/rRXrFORbso
— Rajasthan Royals (@rajasthanroyals) October 16, 2020
When admin realises he started a false rumour. https://t.co/QOHcJD7pNk pic.twitter.com/vXBVcizcNT
— Rajasthan Royals (@rajasthanroyals) October 16, 2020
అయితే ఆ రూమర్లకు చెక్ పెడుతూ.. క్లారిటీ ఇచ్చేసింది రాజస్థాన్ జట్టు.. ©️aptain అంటూ స్మిత్ ఫోటో పెట్టి పోస్ట్ చేసింది. అడ్మిన్ చేసిన పోస్ట్‌ని ఇష్టం వచ్చినట్లు అనేసుకుని తప్పుడు ప్రచారం చేసినట్లుగా రాజస్థాన్ రాయల్స్ అభిప్రాయపడింది. క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేసింది. దీంతో కేకేఆర్ బాటలోనే రాజస్థాన్ రాయల్స్ తమ టీమ్ కెప్టెన్‌ను మార్చే యోచనలో లేనట్లు తేలిపోయింది.
ఐపీఎల్ 2020లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌ల్లో మూడు మాత్రమే గెలిచిన రాజస్థాన్ పాయింట్స్ టేబుల్‌లో 7వ స్థానంలో ఉంది. ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లో గెలుపు ముంగిట ఆ జట్టు బోల్తా పడింది. బ్యాటింగ్ వైఫల్యం ఆ జట్టు ఇబ్బందులు పడడానికి కారణం అవుతుంది. బెన్ స్టోక్స్ వచ్చిన తర్వాత కూడా జట్టు గెలవలేకపోవడం ఆ జట్టుకు కాస్త ఇబ్బంది కలిగిస్తున్న విషయం.