ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది రాజస్థాన్. విజయంతో బోణీ కొట్టి సూపర్ కింగ్స్ ను ఓటమికి గురి చేసింది. షార్జా వేదికగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో ఏకపక్షంగా సాగించింది స్మిత్ సేన. ఓపెనర్ జైస్వాల్(6)పరుగులకే పరిమితమై పెవిలియన్ చేరినప్పటికీ స్టీవ్ స్మిత్(69: 47బంతుల్లో 4ఫోర్లు, 4 సిక్సులు), సంజూ శాంసన్(74: 32బంతుల్లో 1ఫోర్, 9సిక్సులు)లతో చెలరేగిపోయారు.
217పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన ధోనీ సేన గెలుపు అంచులు చేరుకోలేకపోయింది. 16పరుగులు ఉండగానే ఓవర్లు ముగియడంతో నిరాశతో వెనుదిరిగింది. డుప్లెసిస్(72: 37బంతుల్లో 1ఫోర్, 7సిక్సులు)తో చేసిన వీరోచిత ప్రదర్శన వృథాగా మిగిలిపోయింది. కెప్టెన్ ధోనీ(29: 17బంతుల్లో 3సిక్సులు) చివరి బంతి వరకూ పోరాడాడు.
ఇప్పటివరకూ జరిగిన మూడు మ్యాచ్ ల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ విజయకేతనం ఎగరేయగా.. ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తలో మ్యాచ్ కోల్పోయారు.