KKR vs RCB : కోల్‌కతాను బౌలర్లు కుమ్మేశారు.. బెంగళూరు లక్ష్యం 85 పరుగులే!

  • Publish Date - October 21, 2020 / 09:27 PM IST

KKR vs RCB : ఐపీఎల్ 2020లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ పేలవ ప్రదర్శనతో స్వల్ప స్కోరుకే పరిమితమైంది. కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 84 పరుగులు మాత్రమే చేసింది. ప్రత్యర్థి బెంగళూరుకు 85 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.



టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్ కతా బెంగళూరు బౌలర్ల దెబ్బకు విలవిల లాడిపోయింది. కోల్ కతాను ఏ దశలోనూ కోలుకోనివ్వకుండా వరుస బంతులతో చుక్కలు చూపించారు.

బెంగళూరు బౌలర్లలో సిరాజ్, మోరిస్, చాహల్ బంతుల మాయాజాలానికి కోల్ కతా ఆటగాళ్లు క్రీజులో ఎక్కువ సేపు నిలువలేకపోయారు.



కోల్ కతా ఓపెనర్లు కేవలం ఒక పరుగుతోనే పెవిలియన్ బాట పట్టేశారు. ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (1), రాహుల్ త్రిపాఠి (1) చేతులేత్తేశారు. ఆ తర్వాత వచ్చిన నితిశ్ రానా ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కోల్ కతా ఆటగాళ్లు స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు. మోర్గాన్ (30) మినహా ఏ ఒక్కరూ రాణించలేకపోయారు.



దినేశ్ కార్తీక్ (4), కమిన్స్ (4) సింగిల్ డిజిట్ కే పరిమితం కాగా.. కుల్దీప్ యాదవ్ (12), బంటన్ (10) పరుగులకే ఒకరితరువాత మరొకరు పెవిలియన్ చేరారు. ఇక ఫెర్గూసన్ (19నాటౌట్)గా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. చాహల్ రెండు వికెట్లు, సైనీ, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీసుకున్నారు.